Mohammed Shami Coach: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand ) మధ్య జనవరి 11వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ కోసం, టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ తరుణంలో కొంతమంది ప్లేయర్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రుతురాజ్ తో పాటు మహమ్మద్ షమీని సెలెక్ట్ చేయలేదు భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలైంది. టీమిండియా సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ ను ( Ajit Agarkar ) టార్గెట్ చేసి మరి ఫ్యాన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ షమీ పర్సనల్ కోచ్ బద్రుద్దీన్ కూడా సీరియస్ అయ్యారు. మహమ్మద్ షమీని ( Mohammed Shami ) తీసుకోవడం దారుణం అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read: Ravichandran Ashwin: టీ20 వరల్డ్ కప్ 2026 కంటే సీరియల్స్ చూడటం బెటర్..టీమిండియా ఆడటం దండగే
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్ కోసం మహమ్మద్ షమీని తీసుకోకపోవడంపై అతని పర్సనల్ కోచ్ బద్రుద్దీన్ ( Mohammed Shami Coach ) స్పందించారు. మహమ్మద్ షమీని తుది జట్టులో తీసుకోవాల్సి ఉంది.. కానీ అనవసరంగా అతన్ని తప్పించారని మండిపడ్డారు. ఒక ప్లేయర్ టీమిండియాలోకి రావాలంటే చేయాల్సిన అన్ని పనులు మహమ్మద్ షమీ చేసి రెడీగా ఉన్నాడని గుర్తు చేశారు. కానీ సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోలేదు.. ఇంకా ఏం చేస్తే అతన్ని టీం ఇండియాలోకి తీసుకుంటారు? ఇంకా ఎన్ని వికెట్లు తీయాలి? అంటూ ప్రశ్నించారు.
కావాలనే మహమ్మద్ షమీపై కుట్రపూరిత రాజకీయాలు జరుపుతున్నారని మండిపడ్డారు. అదే సమయంలో బెంగాల్ కోచ్ శుక్లా సైతం దీనిపై స్పందించారు. మహమ్మద్ షమీని తీసుకోకపోవడం దారుణం అంటూ నిప్పులు చెరిగారు. ఏ అంతర్జాతీయ ప్లేయర్ కూడా ఆయనలాగ డెడికేషన్ తో దేశవాళి క్రికెట్ ఆరటం లేదని గుర్తు చేశారు. విజయ్ హజారే టోర్నమెంట్ లో కూడా ఐదు మ్యాచ్ ల్లో 11 వికెట్లు తీసి సత్తా చాటినట్లు గుర్తు చేశారు. అతడు ముస్లిం కాబట్టే టీమిండియాలోకి తీసుకోవడం లేదంటూ షమీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా టీమిండియా ( Team India ) సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ ను ( Ajit Agarkar ) తొలగించాలని కోరుతున్నారు.
భారత జట్టు: గిల్ (C), రోహిత్, కోహ్లి, రాహుల్ (WK), అయ్యర్ (VC), సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్, ప్రసిద్ధ్, కుల్దీప్, పంత్ (WK), నితీష్, అర్ష్దీప్, యశస్వి.
🚨🚨 Favouritism from Ajit Agarkar once again for ODIs!
– Selected his parchi with 33 ODI avg & 31 List A average.
– Didn't selected Ishan Kishan with proven ODI credentials & 42 ODI avg.
– Didn't selected Sanju Samson who has ODI avg of 56 & 100 in his last ODI.
– Dropped… pic.twitter.com/5iam173J8A— Rajiv (@Rajiv1841) January 3, 2026