E-Paper
Advertisement

Big tv kissik talks: జీవితాంతం జనసేనకే నా మద్దతు..అస్సలు తగ్గను..ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన హైపర్ ఆది!

Big tv kissik talks: జీవితాంతం జనసేనకే నా మద్దతు..అస్సలు తగ్గను..ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన హైపర్ ఆది!
Advertisement

Big tv Kissik Talks: హైపర్ ఆది కమెడియన్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అలాగే రాజకీయాల పరంగా కూడా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈయన రాజకీయాల పరంగా జనసేన పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేయడమే కాకుండా గత ఎన్నికల సమయంలో పిఠాపురంలో పర్యటనలు చేసి పవన్ కళ్యాణ్ విజయానికి దోహదం చేశారు. ఇలా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే వీరాభిమానం ఉన్న ఆది పవన్ గురించి ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే వారు ఎంతటి వారైనా ఈయన తనదైన శైలిలోనే సమాధానం ఇస్తూ ఉంటారు. తాజాగా కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు రావడంతో ఆది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పవన్ కోసం ఎంత దూరమైనా వెళ్తా..

సోషల్ మీడియా వేదికగా ఆది వేసే కామెడీ పై చాలామంది విమర్శలు కురిపిస్తుంటారు .డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నారని ఈయనపై విమర్శలు వస్తుంటాయి ఈ విమర్శల గురించి వర్ష ప్రశ్నించడంతో ఆది సమాధానం చెబుతూ ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో వారందరూ కూడా నేను వేసే డబుల్ మీనింగ్ డైలాగులను చూసి కాదని పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయడం వల్లే విమర్శలు కురిపిస్తున్నారని తెలిపారు. ట్రోల్ చేసే బ్యాచ్ కొంతమంది ఉన్నారు. వారికి నేను ఒకటే విషయం చెబుతున్న మీరు ఎంత విమర్శించినా పవన్ కళ్యాణ్ విషయంలో నేను వెనక్కి తగ్గను ,ఎవరికి భయపడను, అవతల ఎవడున్నా సరే ప్రశ్నిస్తానని ఆది హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ విషయంలో బెదిరింపులు.

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను జీవితాంతం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తానని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కోసం నేను నిలబడినందుకు ఇప్పుడే కాదు కాలేజీ సమయంలో కూడా నాకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. కొంతమంది సీనియర్లు నన్ను బిల్డింగ్ మీదకు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ పేరు చెబితే ఇక్కడి నుంచి తోసేస్తామంటూ బెదిరించారు అయినా నేను భయపడలేదు అలా నన్ను బెదిరించిన వారు ఇప్పటికే సప్లీలు రాస్తూ ఆ బిల్డింగ్ చుట్టే తిరుగుతున్నారు నేను మాత్రం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లిపోయానని తెలిపారు.

Advertisement

నేను మెచ్చిన నాయకుడు అందరిలాగా జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు లెక్కలేనంత జనాభా కి ఒకే ఒక్కడు అంటూ హైపర్ ఆది తెలియచేశారు నా నాయకుడికి దనం మీద వ్యామోహం లేదు. ఆస్తులు మీద వ్యామోహం లేదు.. నిజాయితీపరుడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు. అలాగే తనపై వచ్చిన విమర్శలను కూడా తిప్పి కొట్టారు. నన్ను కెరియర్ పరంగా తొక్కేయాలని చూసినా నేను భయపడను సినిమాలు లేకపోతే టీవీ చేసుకుంటాను. టీవీలలో కూడా ఛాన్సులు లేకపోతే బీటెక్ చదివాను ఉద్యోగం చేసుకుంటా అది కూడా లేకపోతే ఊరెళ్ళిపోయి పొలం చేసుకుంటాను చివరికి వాచ్మెన్ గా ఉండటానికి కూడా నేను వెనకాడను కానీ, బెదిరింపులకు తాను అసలు భయపడనని నేను నా టాలెంట్ ను నమ్ముకునే ఈ స్థాయిలో ఉన్నానని ఆది తెలిపారు.

Also Read: Big tv kissik talks: ఆయన పరిచయం నా జీవితాన్ని మార్చేసింది..: హైపర్ ఆది

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×