Mohammed Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami) గురించి తెలియని వారు ఉండరు. టీమిండియా జట్టులో చాలా రోజుల నుంచి కొనసాగుతున్న మహమ్మద్ షమీ, జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థికి చుక్కలు చూపించేవాడు మహమ్మద్ షమీ. అయితే అలాంటి మహమ్మద్ షమీ ప్రస్తుతం టీమిండియాకు దూరమై, రంజి ట్రోఫీలు వాడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే తన బట్టతలకు చెక్ పెట్టి కొత్త గెటప్ లో మెరిసాడు మహమ్మద్ షమీ. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read: Ravi Shastri: నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని, గంభీర్ లాగా చిల్లర వేశాలు వేసేవాడిని కాదు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కొత్త గెటప్ లో కనిపించాడు. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా కొత్త హెయిర్ స్టైల్ తో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహమ్మద్ షమీ కూడా తన బట్టతలకు చెక్ పెట్టి, కొత్త అవతారంలో మెరిశాడు. బట్టతల స్థానంలో కొత్తగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు మహమ్మద్ షమి. ముంబై కి సంబంధించిన ఓ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ స్షెషలిస్ట్, మహమ్మద్ షమీని కొత్త అవతారంలో చూపించారు. తన అనుభవాన్ని మొత్తం మహమ్మద్ షమీపై పెట్టి, పెళ్ళికొడుకు తరహాలో తయారు చేశారు. దీంతో మహమ్మద్ షమీ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మాలిక్ మాజీ భార్య సానియా మీర్జా ( Sania Mirza), మహమ్మద్ షమీ కి మధ్య రిలేషన్ ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. గతంలో మహమ్మద్ షమీ దీని ఖండించే ప్రయత్నం చేసినప్పటికీ, రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా కొత్త గెటప్ లో మహమ్మద్ షమీ మెరిశాడు. దీంతో సానియా మీర్జాతో పెళ్లి కోసమే ఇలా కొత్త గెటప్ లో కనిపించాడని అంటున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా మహమ్మద్ షమీ ఇప్పటికే తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చినప్పటికీ కూడా తన భార్య ఆయేషా, అతని కూతురు కోసం నెలకు 4 లక్షల రూపాయల వరకు మెయింటెనెన్స్ కింద డబ్బులు పంపిస్తున్నాడు. అయినప్పటికీ ఆ డబ్బులు సరిపోవడంలేదని ఆయేషా తాజాగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. నెలకు పది లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. ఇక అటు షోయబ్ మాలిక్ , సానియా మీర్జా ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రముఖ నటిని మూడవ పెళ్లి చేసుకున్నాడు షోయబ్ మాలిక్. దీన్ని నేపథ్యంలోనే సింగిల్ లైఫ్ లీడ్ చేస్తోంది సానియా మీర్జా. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరు రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
Mohammed Shami looking razor sharp on and off the field! ✨#MohammedShami #Cricket #CricketImpulse pic.twitter.com/2OCui5lVk1
— Cricket Impluse (@cricketimpluse) December 2, 2025
Sania Mirza celebrating Christmas with Indian cricketer Shami in Dubai pic.twitter.com/xDhYNwGITo
— Zimal Altamash (@ZimalAltamash) December 25, 2024