E-Paper
Advertisement

Monty Panesar: మూఢ న‌మ్మ‌కాలు వ‌దిలేయ్‌..ఆ ఎర్ర‌టి గుడ్డ‌నే నిన్ను నాశనం చేస్తోంది, అభిషేక్ పై ప‌నేస‌ర్ సీరియ‌స్‌

Monty Panesar:  మూఢ న‌మ్మ‌కాలు వ‌దిలేయ్‌..ఆ ఎర్ర‌టి గుడ్డ‌నే నిన్ను నాశనం చేస్తోంది, అభిషేక్ పై ప‌నేస‌ర్ సీరియ‌స్‌
Advertisement

Monty Panesar: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా నిన్న దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium, Ahmedabad) నిన్న దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs South Africa) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. అటు మరోసారి అభిషేక్ శర్మ ( Abhishek Sharma) విఫలమయ్యాడు. చాలా కీలకంగా మారిన సూపర్ 8 లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శ‌ర్మ చేతులెత్తేశాడు. ఈ త‌రుణంలోనే అభిషేక్ శ‌ర్మ‌పై మాంటీ పనేసర్ ( Monty Panesar ) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అభిషేక్ హెల్మెట్ కింద ఎర్రటి గుడ్డ‌ ధరించడం మానేయాలని మాంటీ పనేసర్ సలహా ఇచ్చారు. మూఢ న‌మ్మ‌కాలు మానేసి బ్యాటింగ్ స‌రిగ్గా చేయాల‌ని చుర‌క‌లు అంటించాడు. దీంతో మాంటీ పనేసర్ ( Monty Panesar ) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ind vs SA Super 8: ద‌క్షిణాఫ్రికా గ్రాండ్ విక్ట‌రీ..13 మ్యాచ్ ల త‌ర్వాత ఓడిన‌ టీమిండియా, సెమీస్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు !

మూఢ న‌మ్మ‌కాలు వ‌దిలేయ్‌..ఆ ఎర్ర‌టి గుడ్డ‌నే నిన్ను నాశనం చేస్తోంది

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిస్తున్నాడు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు మూడు సార్లు డక్ అవుట్ అయ్యాడు. గ్రూప్ స్టేజిలో నమీబియా, నెదర్లాండ్స్ అలాగే పాకిస్తాన్ తో ఆడింది టీం ఇండియా. ఈ మూడు మ్యాచ్లలో కూడా అభిషేక్ శర్మ డక్ ఔట్ అయ్యాడు. అయినప్పటికీ సూపర్ 8లో భాగంగా దక్షిణాఫ్రికా తో జరిగిన ఆదివారం మ్యాచ్ లో అభిషేక్ శర్మకు అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్ లో 15 పరుగులకే అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. దీంతో అభిషేక్ శర్మ పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి.

టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడంపై తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ( Monty Panesar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ ఇకపై బ్యాటింగ్ చేసేటప్పుడు తలకు ఎర్రటి గుడ్డ కట్టకూడదని కోరాడు. ఆ గుడ్డ వల్లే, అభిషేక్ శర్మ దారుణంగా విఫలమవుతున్నాడని బాంబు పేల్చాడు మాంటీ పనేసర్. కొంతమంది పూజారులు చెప్పినట్లుగా అభిషేక్ శర్మ వింటున్నాడని మండిపడ్డారు. మంత్రించి ఇచ్చిన ఆ ఎర్రటి గుడ్డ అభిషేక్ శర్మ తన తలకు కట్టుకుంటున్నాడని ఆరోపణలు చేశారు. ఆ మూఢ నమ్మకాలు నమ్మి…. ఎర్రటి గుడ్డ కట్టుకోవడం దారుణం అన్నారు. ఆ గుడ్డ నే అభిషేక్ శర్మ కెరీర్ ను నాశనం చేస్తుందని నిప్పులు చెరిగారు. ఇకపై ఆ ఎర్రటి గుడ్డ తీసేసి బ్యాటింగ్ చేస్తే అభిషేక్ శర్మ అదరగొడతాడని సూచనలు చేశారు పనేశారు.

Advertisement

 

 

Also Read: Nasser Hussain: పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు..అందుకే వ‌ర్షాలు ప‌డే శ్రీలంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్ లు !

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×