E-Paper
Advertisement

DMHO Jobs: ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం భయ్యా.. ఆ జిల్లాలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ, పూర్తి వివరాలు ఇదిగో..

DMHO Jobs: ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం భయ్యా.. ఆ జిల్లాలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ, పూర్తి వివరాలు ఇదిగో..
Advertisement

విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం (DM&HO) నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను నేరుగా సమర్పించవచ్చు.

పోస్టుల వివరాలు..

Advertisement

విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 20 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఫార్మసిస్ట్ గ్రేడ్-II విభాగంలో 4 పోస్టులు.. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II లో 4 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ కేటగిరీలో 5 పోస్టులు.. లాస్ట్ గ్రేడ్ సర్వీస్‌లో 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే సీనియర్ ట్రీట్ మెంట్ సూపర్ వైజర్ విభాగంలో 02 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

విద్యార్హతలు.. 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి నిర్ణీత విద్యార్హతలు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి డీఎంఎల్‌టీ(DMLT, ఎంఎల్టీ (MLT),  డి.ఫార్మసీ.. బి.ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తమ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ను దరఖాస్తుతో పాటు జతపరచాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం..

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. కేవలం అభ్యర్థులు తమ విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ విధానం.. 

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. విశాఖపట్నంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయంలో దరఖాస్తు ఫారమ్ సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు..

జనరల్ అభ్యర్థులు రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ.. ఎస్టీ.. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. దరఖాస్తులు సమర్పించడానికి ఫిబ్రవరి 26వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీ వివరాలు.. 

చివరి తేది: ఫిబ్రవరి 26

అఫీషియల్ వెబ్ సైట్: https://visakhapatnam.ap.gov.in/

ALSO READ: TG TRANSCO: ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు.. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×