E-Paper
Advertisement

Romario Shepherd: ముంబైని గెలిపించిన వీరుడు.. రొమారియో షెఫర్డ్!

Romario Shepherd: ముంబైని గెలిపించిన వీరుడు.. రొమారియో షెఫర్డ్!
Advertisement
Romario shepherd
Romario shepherd

Romario shepherd in last ipl match: ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ విజయాల బాట పట్టింది. హార్దిక్ పాండ్యా మొఖంలో ఆనందం కనిపించింది. రోహిత్ శర్మ తన తప్పులేదన్నట్టు ఆడాడు. బుమ్రా మెరిశాడు. అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ కనిపించాయి. నిన్నటి వరకు అన్నీ లోపాలే ఉన్నట్టు కనిపించిన ముంబయి ఇండియన్స్ ఒక్క గెలుపుతో అన్నీ పటాపంచలైనట్టు కనిపించాయి.

ఈ గెలుపు వెనుక ఒక మొనగాడున్నాడు. అతనే రొమారియో షెఫర్డ్.. చివర్లో వచ్చి దుమ్ముదులిపి, మామూలుగా ఆడలేదు. అరవీర భయంకరంగా రెచ్చిపోయాడు. 10 బాల్స్ లో 39 పరుగులు చేశాడు. అంతేకాదు నోకియా వేసిన చివరి ఓవర్ లో ఏకంగా 32 పరుగులు పిండుకున్నాడు. ఇదే మ్యాచ్ మలుపునకు కారణమైంది.

Advertisement

ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్ట్రయిక్ రేట్ 390.0 తో ఆడిన ఆటగాడిగా షెపర్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (373.3 )పేరిట ఉంది. నిజానికి ఆ ఓవర్ లో షెపర్డ్ 4,6,6,6,4,6 ఇలా కొట్టుకుంటూ వెళ్లాడు.

Also Read: యశ్ ఠాకూర్ ఎవరు భయ్?

Advertisement

ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి 234 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 205 పరుగులు మాత్రమే చేసింది. అంటే 29 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పుడు షెఫర్డ్ ఆఖరి ఓవర్లో చేసిన 32 పరుగులు గానీ లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ ఏదో రకంగా గెలిచి ఉండేది.

ఆ ఒక్క ఓవర్  మ్యాచ్ గెలుపు ఓటములను మార్చింది కాబట్టి ఫెఫర్డ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం గేమ్ లోకి వచ్చామని అన్నాడు. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ కి వెళ్లినప్పుడు క్లియర్ మైండ్ సెట్ తో ఉండాలని అన్నాడు. దేనిగురించి ఆలోచించ కూడదని తెలిపాడు.

టిమ్ డేవిడ్ తో కలిసి చివరి ఓవర్ ఆడాను. ఏదైతే అదే అయ్యింది, బ్యాట్ ఝులిపించమని చెప్పాడు. తన మాట మేరకు నా శక్తినంతా ఉపయోగించి బాల్ పై దాడి చేశానని అన్నాడు. అలా సిక్సర్లు కొట్టడానికి చాలా శక్తి కావాలని అన్నాడు. దానికి బాగా తినాలని కూడా చెప్పాడు. నేనెక్కువ తింటాను. ముఖ్యంగా ఇండియన్ ఫుడ్డు అంటే నాకు చాలా ఇష్టమని అన్నాడు.  29 సంవత్సరాల రొమారియో షెఫర్డ్ వెస్టిండీస్ కి చెందిన ఫాస్ట్ బౌలర్. కానీ తనిలా ఒక బ్యాటర్ గా ఆడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అలాగే ముంబై ఇండియన్స్ కి టెన్షన్ తగ్గించింది.

Tags

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×