BigTV English

Raviteja Warns Jagapathi Babu: జగపతి బాబుకు రవితేజ మాస్ వార్నింగ్.. రా చూసుకుందాం!

Raviteja Warns Jagapathi Babu: జగపతి బాబుకు రవితేజ మాస్ వార్నింగ్.. రా చూసుకుందాం!
Mister Bachhan Movie Update
Mister Bachhan Movie Update

Raviteja Mass Warning to Jagapathi Babu: మాస్ మహారాజా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో మిస్టర్. బచ్చన్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా ఈ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.


తాజాగా జగపతి బాబు లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్ చూస్తుంటే.. ఈసారి జగపతి బాబు రంగస్థలం సినిమాలో కన్నా క్రూరంగా కనిపించాడు. పంచె కట్టుకొని,చదరంగం ముందు కూర్చొని.. చేతిలో ఒక పావును పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపించాడు. ఇక దీనికి క్యాప్షన్ గా జగ్గూభాయ్.. ” మిస్టర్ బచ్చన్ లో మాస్ మహారాజా ను ఏసేయడానికి సిద్ధం” అంటూ రాసుకొచ్చాడు.

ఇక దీనికి సమాధానంగా మాస్ మహారాజా రవితేజ.. జగ్గూభాయ్ కు తనదైన రీతిలో వార్నింగ్ ఇచ్చాడు.. ” మిస్టర్ బచ్చన్ ఇక్కడ.. ఎవరు ఎవరిని ఏసేస్తారో చూసుకుందాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్లు నెట్టింట వైరల్ గా మారాయి. రవితేజ కెరీర్ మొదట్లో జగపతిబాబు సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు రవితేజ. ఇప్పుడు అతడు హీరోగా చేస్తున్న సినిమాలో జగ్గూభాయ్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో చెప్పలేం అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక హరీష్ శంకర్.. పవన్ భగత్ సింగ్ గ్యాప్ రావడంతో.. ఆ గ్యాప్ ను మిస్టర్ బచ్చన్ తో ఫుల్ ఫిల్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


Also Read: Anupama Parameswaran: ఎన్టీఆర్ ముందే అనుపమకు అవమానం.. మరీ ఇంత దారుణమా.. ?

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×