BigTV English

Petition on Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలంటూ పిటిషన్.. భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు!

Petition on Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలంటూ పిటిషన్.. భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు!
Arvind Kejriwal ed news
Arvind Kejriwal

Delhi High Court on Arvind Kejriwal Remove to As Delhi CM: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో భాగంగా అరివింద్ కేజ్రీవాల్ ను సీఎం పదవినుంచి తొలగించాలంటూ నమోదైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. దీంతో కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించినట్లైంది.


మద్యం పాలసీ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయనకు వ్యతిరేకంగా నమోదైన పిల్ ను కొట్టివేసింది. అరవింద్ కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

సీఎం ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల రాజ్యాంగ యంత్రాంగాన్ని క్లిష్టతరం చేస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం సీఎం ఎప్పుడు కూడా జైలు నుంచి విధులు నిర్వహించలేదని సందీప్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, ఈ కేసు నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది.


జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపింది. అయితే కొందరు పబ్లిసిటీ కోసం ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని న్యాయమూర్తి విమర్శించారు. దీంతో ఈ పిటిషన్ ను న్యాయమూర్తి లిస్ట్ చేయడంతోపాటుగా తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాటుగా సందీప్ కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్ కు భారీగా కోర్టు ఖర్చులు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: kangana denies allegations: ఛీ ఛీ.. అవేం మాటలు, నేను అసలైన..!

లిక్కర్ కేసులో కేజ్రీవాల్, కవిత అరెస్ట్ లతో పాటుగా మరింత జోరు పెంచారు. ఈ తరుణంలో వరుసగా ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈడీ నోటీసులు పంపిస్తోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్యే పాఠక్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. గోవా ఎన్నికల సమయంలో నగదు చెల్లింపుల విషయంలో పాఠక్ పేరు ప్రస్తావనకు రావడంతో ఆయన్ను కూడా ఈడీ త్వరలోనే విచారించే అవకాశం ఉంది.

మరోవైపు ఈ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను కూడా ఈడీ ప్రశ్నించింది. సోమవారం ఈడీ అధికారులు బిభవ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×