E-Paper
Advertisement

MS Dhoni Fan Marriage Contract: ధోని ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా బాబు…పెళ్లి కూతురుతో అలాంటి బాండ్ రాయించుకున్నాడు!

MS Dhoni Fan Marriage Contract: ధోని ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా బాబు…పెళ్లి కూతురుతో అలాంటి బాండ్ రాయించుకున్నాడు!
Advertisement

MS Dhoni Fan Marriage Contract: మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వికెట్ కీపర్ గా తన జర్నీ ప్రారంభించి, టీమిండియాకు ఎన్నో ఐసీసీ టోర్నమెంట్లు అందించాడు మహేంద్రసింగ్ ధోని. దాదాపు 15 ఏళ్ల పాటు టీమిండియా క్రికెట్ ను ఏలిన మహేంద్ర సింగ్ ధోనీకి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 44 సంవత్సరాలు పూర్తయిన మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ను ఇప్పటికి కూడా అభిమానులు ఎగబడి చూస్తారు. దీనికి నిద‌ర్శ‌న‌మే చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ధోని బ్యాటింగ్ చేయ‌డం. ఆ జ‌ట్టు త‌ర‌ఫున ధోని ఒక్క బంతి ఆడినా, చూసేందుకు ఎగ‌బ‌డుతారు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ఓ అభిమాని పెట్టిన కండిషన్ ఇప్పుడు వైరల్ గా మారింది. పెళ్లికి ముందు తనకు కాబోయే భార్యకు కండిషన్ పెట్టాడు. దానికోసం ఏకంగా బాండ్ పేపర్ కూడా రాయించుకున్నాడు సదరు ధోని ఫ్యాన్.

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

పెళ్లికి ముందు బాండ్ రాయించుకున్న మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్

Advertisement

మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ లు చూసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. ఇక అతని ఫాన్స్ అయితే ఎగబడి చూస్తారు. ఈ నేపథ్యంలోనే మహేంద్ర సింగ్ ధోని ఆడే మ్యాచ్ లపై ఓ కొత్త పెళ్లి కొడుకు వింత కండీష‌న్‌ పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. అతడు కూడా మహేంద్ర సింగ్ ధోని అభిమాని కావడం విశేషం. తన పెళ్లి వేడుకలో ధృవ్ మజేథియా అనే మహేంద్ర సింగ్ ధోని అభిమాని, తనకు కాబోయే భార్య అషీమాతో అగ్రిమెంట్ రాయించుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత కూడా తనకు ఇష్టమైన మహేంద్ర సింగ్ ధోని ఆడే ప్రతి మ్యాచ్ చూసేలా పర్మిషన్ ఇవ్వాలని కోరాడు ధృవ్ మజేథియా. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లతో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లు చూసేలా అనుమతి ఇవ్వాలంటూ కండిషన్ పెట్టాడు. ఇందులో భాగంగానే తనకు కాబోయే భార్యతో అగ్రిమెంట్ రాయించుకున్నాడు ధృవ్ మజేథియా.

ఆ అగ్రిమెంటును వధువుతో పెళ్లి మండపం దగ్గరే చదివించాడు. పెళ్లి అయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ లు చూడనివ్వకపోతే, విడాకుల దాకా వెళ్తానని అగ్రిమెంట్ కూడా రాశాడు సదరు పెళ్ళికొడుకు ధృవ్ మజేథియా. ఇక ఈ కండిషన్ కు ఒప్పుకున్న వధువు అషీమా, పెళ్లి మండపంలోనే అగ్రిమెంట్ చదివి, తాళి కట్టించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన అగ్రిమెంట్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని అభిమానులు ఇలా ఉన్నారేంట్రా బాబు అంటూ మరికొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు. మహేంద్ర సింగ్ ధోని అభిమానులు అంటే మినిమం ఉంటుందని మరికొందరు అంటున్నారు.

Advertisement

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×