E-Paper
Advertisement

Messi Meets Revanth: రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

Messi Meets Revanth: రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు
Advertisement

Messi Meets Revanth:  ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) మ్యాచ్ కు సర్వం సిద్ధం అయింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ లో తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. CM రేవంత్ రెడ్డి  ( CM Revanth Reddy) వ‌ర్సెస్ లియోనెల్ మెస్సీ మ‌ధ్య‌ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం జ‌రుగ‌నుంది. యువత, క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వ‌హిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న రేవంత్ రెడ్డి స‌ర్కార్, భారీ ఏర్పాట్లు చేసింది.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

మెస్సీ వ‌ర్సెస్ సీఎం రేవంత్ మ్యాచ్ ఎప్పుడంటే ?

Advertisement

ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని అధికారులు చెబుతున్నారు. అనంత‌రం ఎయిర్ పోర్టు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ కు లియోనెల్ మెస్సీ వెళ‌తారు. ఇక అక్కడి నుంచి నేడు సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు మెస్సీ. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు అంటే దాదాపు గంటపాటు ఫుట్ బాల్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో కొన‌సాగ‌నుంది. ఇక ఈ మ్యాచ్ చివ‌రి 10 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని అంటున్నారు. ఈ మ్యాచ్ పూర్త‌యిన త‌ర్వాత‌ విజేతలకు బహుమతులు అందజేస్తారు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఫోటో షూట్ ఉంటుంది. ఆ త‌ర్వాత ఫలక్ నుమా ప్యాలెస్ కు తిరిగి వెళ్తారట మెస్సీ. రాత్రి ప్యాలెస్ లో బస చేసి, రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ముంబై ప‌యనం అవుతారు ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ. హైద‌రాబాద్ లో మెస్సీ ఉన్నంత సేపు Z క్యాటగిరి భద్రత ఏర్పాటు చేయ‌నున్నారు హైద‌రాబాద్ పోలీసులు.

మెస్సీతో ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం పశ్చిమ బెంగాల్లోని కోల్ క‌తా నగరానికి చేరుకున్నాడు లియోనెల్ మెస్సీ. ఈ సందర్భంగా లియోనెల్ మెస్సీకి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ఇవాళ సాయంత్రం వరకు కోల్కత్తాలోని ప్రముఖ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రానికి హైదరాబాద్ వస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఆడిన తర్వాత ఫోటో సెషన్ లో పాల్గొంటారట. అయితే లియోనెల్ మెస్సీతో ఫోటో దిగితే పది లక్షల ఫీజు చెల్లించాల్సిందేనని నిర్ణయించారట. అయితే ఈ ఫోటో కోసం దాదాపు 50 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

 

 

 

Related News

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

Big Stories

Advertisement
×