E-Paper
Advertisement

MI Vs RCB IPL 2024 Preview: విరాట్..? రోహిత్..? ఇద్దరిలో ఎవరు..? నేడు ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్!

MI Vs RCB IPL 2024 Preview: విరాట్..? రోహిత్..? ఇద్దరిలో ఎవరు..? నేడు ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్!
Advertisement
MI Vs RCB, IPL 2024 Dream11 Prediction: ఐపీఎల్ లో ఎవరెవరు ఎదురుపడకూడదో, వారే ఎదురవుతున్నారు. రెండు సింహాలు.. కొదమ సింహాల్లా మారి ఆడితే ఎలా ఉంటుందో,  నేడు మ్యాచ్ అలాగే ఉంటుంది. ఆ రెండు సింహాలు ఎవరో కాదు, ఒకరు ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ అయితే, మరొకరు ఆర్సీబీ నుంచి విరాట్ కొహ్లీ.. వీరిద్దరూ ఎదురెదురుగా ఆడితే అభిమానులకు పండగే పండగలా ఉంటుంది.

నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య ముంబై వాంఖేడీ స్టేడియంలో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య ఒక సారూప్యత ఉంది. అదేమిటంటే రెండు జట్లు కూడా ఒకొక్క మ్యాచ్ మాత్రమే ఇప్పటివరకు గెలిచాయి. ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్ లు ఆడి మూడు ఓడిపోయి, ఒకటి గెలిచింది. ఆర్సీబీ అయితే ఐదు మ్యాచ్ లు ఆడి 4 ఓడి, ఒకటి గెలిచింది.

ఇప్పుడు రెండు జట్లకి గెలవక తప్పని మ్యాచ్ ఇది…ఎందుకంటే ఇప్పటికే పాయింట్ల టేబుల్ లో రెండు జట్లు ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. 8వ స్థానంలో ముంబై ఉంటే, 9వ స్థానంలో ఆర్సీబీ ఉంది. ఓవరాల్ గా ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 34 మ్యాచ్ లు జరిగితే ముంబై 20 సార్లు గెలిస్తే, ఆర్సీబీ 14 సార్లు విజయం సాధించింది.

Advertisement

Also Read: ముంబైకి షాక్ మీద షాక్..

ఏదేమైనా ముంబై నుంచి రోహిత్ శర్మ ఆడాలి. అలాగే ఎన్నో అంచనాలతో వచ్చిన సూర్యకుమార్ తొలి మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఇప్పుడు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆడుదాం, చూద్దామంటే మ్యాచ్ లు లేవు. టేబుల్ లో టాప్ ఫోర్ ప్లేసెస్ ఫుల్ అయిపోతున్నాయి. వీరెక్కడో 8వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ నుంచి ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి ఈ మ్యాచ్ అగ్నిపరీక్షలా మారనుంది.

Advertisement

ఇక ఆర్సీబీ విషయానికి వస్తే, వీరి పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ విజయ్ మాల్యా చేతుల్లో ఉంది. కాకపోతే తను ఆర్థిక నేరాలకు పాల్పడటంతో దేశం దాటి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అది ఓనర్ లేకుండానే నడుస్తోంది. అందువల్లే వీళ్లిలా ఆడుతున్నారేమో తెలీదు. ప్రస్తుతం కొహ్లీ ఒక్కడే బండి లాగుతున్నాడు. ఈసారేం చేస్తాడో చూడాల్సిందే.

Related News

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Big Stories

Advertisement
×