BigTV English

Navdeep Campaign’s for Pawan Kalyan: ప్రచారంలోకి సినీ గ్లామర్.. హీరో నవదీవ్ ఎవరి వైపు..?

Navdeep Campaign’s for Pawan Kalyan: ప్రచారంలోకి సినీ గ్లామర్.. హీరో నవదీవ్ ఎవరి వైపు..?

Hero Navdeep Campaign for Pawan Kalyan in Elections 2024: ఏపీలో ఎన్నికలు వస్తున్నాయంటేచాలు.. సినీ గ్లామర్ సందడి అంతాఇంతా కాదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఏ ఒక్కరూ కనిపించలేదు. నోటిఫికేషన్‌కు సమయం దగ్గర పడుతుండడంతో నటీనటులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే హీరో నిఖిల్ టీడీపీ తరపున ప్రచారంలో నిమగ్నమయ్యాడు. తాజాగా యువ హీరో నవదీప్ తన మనసులోని మాటను బయటపెట్టారు. నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని చెబుతూనే, తన మద్దతు పవన్ కల్యాణ్‌కే ఉంటుందన్నారు. రేపో మాపో  ఈ హీరో కూడా ప్రచారంలోకి దిగబోతున్నాడు.


బుధవారం పిఠాపురం వచ్చిన నవదీప్, శ్రీపాద వల్లభుడిని దర్శించుకున్నాడు. లవ్ మౌళి మూవీ ట్రైలర్ సందర్భంగా ఆలయంలో పూజలు చేశాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పవన్ తరపున పిఠాపురంలో ప్రచారానికి రాబోతున్నాడన్నమాట. రేపోమాపో నటీనటులు కూడా రంగంలోకి దిగుతున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. అయితే ఏఏ ప్రాంతాల్లో చేయాలనే దానిపై ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వారంలో కొలిక్కి రావచ్చని చెబుతున్నారు.

Also Read: Love Mouli Trailer: నవదీప్ బోల్డ్ కంటెంట్.. అర్జున్ రెడ్డికి మరో వెర్షన్ లా ఉందే..!


గత ఎన్నికల్లో టాలీవుడ్ నుంచి చాలామంది నటీనటులు ప్రచారంలోకి దిగారు. ముఖ్యంగా జగన్ పార్టీ తరపున చాలామంది ప్రచారం చేశారు. ముఖ్యంగా అలీ, మోహన్‌బాబుతోపాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా తన బ్రదర్ తరపున నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి పెద్దగా సినీ గ్లామర్ కనిపించలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ లెక్కన కొద్దిరోజుల్లో మరికొందరు నటీనటులు ఎంట్రీతో ఏపీలో రాజకీయాలు వేడెక్కడం ఖాయమని అంటున్నారు.

Related News

Jagan on Pulivendula: జగన్ ప్రెస్ మీట్.. ఓటమిని అంగీకరిస్తున్నారా?

AP Liquor Shops: మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్త జీవో పూర్తి వివరాలు..

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Big Stories

×