Muneeba To Captain Pakistan Team: 2026 టీ20 మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. వరుసగా గ్రూప్ స్టేజ్ లోనే మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది పాకిస్తాన్ మహిళల టీం (Pakistan women’s team). ఈ క్రమంలో గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ కూడా అయింది. దీంతో పాకిస్తాన్ మహిళల జట్టును అత్యంత దారుణంగా విమర్శలు చేశారు. పాకిస్తాన్ లో అడుగు పెడితే రాళ్లతో కొడతామని అభిమానులు కూడా హెచ్చరించారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు (Fatima Sana) ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ టీ20 కెప్టెన్ పదవి నుంచి ఆమెను తప్పించింది PCB. అంతేకాదు టీ20 పాకిస్తాన్ మహిళల జట్టులో 8 మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య జూలై 23వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు మూడు టి20 లతో పాటు మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగే టి20 ల నేపథ్యంలో కొత్త కెప్టెన్ ను నియామకం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఫాతిమా సనా స్థానంలో మునీబా అలీని నియామకం చేసింది. ది 100 లీగ్ టోర్నమెంట్ ఈనెల చివరలో జరగనుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ కు ఫాతిమా సనా వెళ్లబోతున్నారు. ది 100 లీగ్ టోర్నమెంట్ లోని బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టుకు ఫాతిమా పాకిస్తాన్ తరఫున ఆడుతున్న తొలి మహిళగా రికార్డ్ సృష్టించనున్నారు.
ఈ క్రమంలోనే ఫాతిమా సనా స్థానంలో టీ20 కెప్టెన్ గా మునీబా అలీని (Muneeba Ali) నియామకం చేశారు. అయితే ఈమెను తాత్కాలికంగానే కెప్టెన్ గా కొనసాగించనున్నారు. మళ్లీ ఫాతిమా సనాకే టీ20 కెప్టెన్సీ దక్కుతుందట. అలాగే టీ20 మహిళల జట్టులో మొత్తం ఎనిమిది మార్పులు చేశారు. కొత్తగా ఎనిమిది మంది జట్టులోకి వచ్చారు. అలియా రియాజ్, ఇరాన్ జావేద్, డయానా బేగ్ లాంటి ప్లేయర్ల పై వేటు పడింది. అదే సమయంలో శ్రీలంకతో జరిగే మూడు వన్డేల టోర్నమెంట్ కు ఫాతిమా కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ వన్డేలు పూర్తయిన తర్వాత ఇంగ్లాండ్ వెళ్తారు.
🚨 𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧 𝐧𝐚𝐦𝐞 𝐬𝐪𝐮𝐚𝐝 𝐟𝐨𝐫 𝟔-𝐦𝐚𝐭𝐜𝐡 𝐒𝐫𝐢 𝐋𝐚𝐧𝐤𝐚 𝐭𝐨𝐮𝐫!
• Muneeba Ali to lead in T20Is as Fatima Sana features in The Hundred 2026 👏
• 8 changes made to the T20I setup, eying success in T20 World Cup 2028 👀#CricketTwitter pic.twitter.com/pvDxpD33tI
— Female Cricket (@imfemalecricket) July 18, 2026