IND VS PAK In World Cup 2027: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్. పురుషుల వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ (2027 ODI World Cup tournament) గురించి ఈ కీలక అప్డేట్ వచ్చింది. ఈ టోర్నమెంట్ అక్టోబర్-నవంబర్ మధ్యలో జరగనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే అలాగే నమీబియా దేశాలు ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్ ను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC). ఈ ఫార్మాట్ ప్రకారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య 3 మ్యాచ్ లు జరిగే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీంతో క్రికెట్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సాధారణంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. అలాంటిది వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు తలపడితే వ్యూయర్షిప్ రికార్డ్ స్థాయిలో నమోదవుతుంది.
2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup tournament) ఫార్మాట్ ను తాజాగా ఐసీసీ (ICC) ప్రకటించింది. దీని ప్రకారం రౌండ్ 1 ఉంటుంది. 14 జట్లలో చివరి మూడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ సిరీస్ నిర్వహిస్తారు. ఇందులో అద్భుతంగా రాణించిన ఒక జట్టు రౌండ్ 2కు వెళ్లడం జరుగుతుంది. ఇక రౌండ్ 2లో మొత్తం 30 మ్యాచులు ఉంటాయి. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజన చేస్తారు. ఒక్కో గ్రూపులోని ఆరు జట్లు మిగతా అన్ని జట్లతో ఢీ కొడతాయి. ఇక టాప్ 3తో పాటు రెండు గ్రూపులలో ఉన్న నాల్గవ బెస్ట్ టీం సూపర్ 7కు చేరుతుంది. రౌండ్ 3లో మొత్తం 21 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ రౌండ్ 3లో సూపర్ 7లో ఒక్కో జట్టు మిగతా జట్లతో తలపడాల్సి ఉంటుంది. టాప్ 4 జట్లు సెమీస్ కు చేరతాయి.
ఐసీసీ (ICC) ప్రకటించిన కొత్త ఫార్మాట్ ప్రకారం… 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs. Pakistan ) మధ్య మూడు మ్యాచ్ లు జరుగుతాయి. గ్రూప్ స్టేజ్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కచ్చితంగా ఒక మ్యాచ్ ఉంటుంది. సూపర్ 7 అంటే రెండో దశలో కూడా ఈ రెండు జట్లు తలపడతాయి. ఇక టీమిండియా, పాకిస్తాన్ రెండు జట్లు సెమీస్ లేదా ఫైనల్స్ కు చేరితే అక్కడ కూడా తల పడాల్సి ఉంటుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
After ICC's rule change, India vs Pakistan clash can happen 3 times in Cricket World Cup. Here's how#Cricket #ICC #INDvPAKhttps://t.co/yNSsh2vfc4 pic.twitter.com/xwnKeYXm84
— NDTV Sports (@Sports_NDTV) July 15, 2026