E-Paper
Advertisement

Coach Ankush Bhardwaj Harassment: మైనర్ షూటర్ పై లై**గిక దాడి..బెడ్‌పైకి లాక్కెళ్లి..కోచ్ అరాచ‌కం

Coach Ankush Bhardwaj Harassment: మైనర్ షూటర్ పై లై**గిక దాడి..బెడ్‌పైకి లాక్కెళ్లి..కోచ్ అరాచ‌కం

Coach Ankush Bhardwaj Harassment: ఇండియా వ్యాప్తంగా ఏ మూలన చూసిన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. లేడీ కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన రూల్స్ తీసుకు వచ్చినప్పటికీ దాడులు మాత్రం తగ్గడం లేదు. సినిమా రంగం నుంచి మొదలుపెడితే, పేదవాడి వరకు ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా క్రీడ రంగంలో దారుణ సంఘటన జరిగింది. ఓ మైనర్ షూటర్ ను లైంగికంగా వేధించాడు కోచ్. నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్‌ భరద్వాజ్ ( national coach Ankush Bhardwaj ) ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే నేషనల్ కోచ్ అంకుశ్‌ భరద్వాజ్ పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

షూటర్ పై లైంగిక వేధింపులు.. కోచ్ సస్పెండ్

నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్ పై ( national coach Ankush Bhardwaj ) లైంగిక ఆరోపణలు పైకి వచ్చాయి. 17 సంవత్సరాల షూటర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు హర్యానా పోలీసులు. ఈ తరుణంలో నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్‌ భరద్వాజ్ పై కేసు కూడా నమోదు చేశారు. ఫరీదాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు కోచ్ అంకుశ్‌ భరద్వాజ్ పై కేసు పెట్టింది బాధిత షూటర్. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారి చేత ఈ ఫిర్యాదు చేయించింది. అయితే ఆ లేడీ షూటర్ పేరు మాత్రం బయటికి తెలుపలేదు పోలీసులు. నేషనల్ కోచ్ భరద్వాజ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకున్న నేపథ్యంలో వెంటనే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. కోచ్ అంకుశ్‌ భరద్వాజ్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కీలక ప్రకటన చేసింది. అటు కోచ్ భరద్వాజ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అదే సమయంలో సిసి టీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు.

కోచ్ భరద్వాజ్ పై సంచలన ఆరోపణలు చేసిన బాధిత మహిళ

నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్‌ భరద్వాజ్ లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బాధిత మైనర్ షూటర్ షాకింగ్ నిజాలను బయటపెట్టింది. గేమ్ అనాలసిస్ పేరుతో తనను 5 స్టార్ హోటల్ కు బలవంతంగా పిలిచాడని బాధిత షూటర్ వెల్లడించింది. ఆ తర్వాత హోటల్ రూమ్లో ఉన్న కుర్చీలో తాను కూర్చున్నానని పేర్కొంది. అనంతరం బెడ్ పైకి లాక్కెళ్ళి తనపై లైంగిక దాడి చేసినట్లు ఎమోషనల్ అయింది. ఆ సందర్భంగా తాను ఎదురుదాడి కూడా చేసినట్లు వివరించింది. కానీ తన కెరీర్ నాశనం చేస్తానని భరద్వాజ్ బెదిరించాడట. పైగా తనతో బాగా నడుచుకోవాలని కండిషన్ పెట్టాడట. ఇక ఆ రాత్రి జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించినట్లు తెలిపింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు.

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×