E-Paper
Advertisement

Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !
Advertisement

Mustafizur Rahman-PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ త‌ప్పుకున్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్ నియంత్రణ మండలిపై ఒత్తిడి రావడంతో ముస్తాఫిజుర్ రహమాన్ పై వేటు వేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంట్ లో ముస్తాఫిజుర్ లాంటి బంగ్లాదేశ్ క్రికెట‌ర్ల‌ను ఆడించకూడదని దేశవ్యాప్తంగా నిరసనలు తెరపైకి వచ్చాయి. అందుకే బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ఆడకుండా ఆదేశాలు ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో ముస్తాఫిజుర్ రహమాన్ వచ్చే టోర్నమెంట్ కు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ టోర్నమెంట్ కు దూరమైన ముస్తాఫిజుర్ రహమాన్ కు ఒక్క రూపాయి కూడా దక్కదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: Bangladesh-IPL 2026: బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్ర‌సారాలు బంద్‌..బీసీసీఐకి ఎన్ని కోట్ల న‌ష్టం అంటే

ముస్తాఫిజుర్ రహమాన్ కు ఒక్క పైసా కూడా రాదా ?

Advertisement

దేశ భద్రత నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచి దూరమయ్యాడు ముస్తాఫిజుర్ రహమాన్. అయితే ఇలా టోర్నమెంట్ ప్రారంభం కాకముందే ఐపిఎల్ నుంచి దూరమైతే, విదేశీ ప్లేయర్లకు ఇన్సూరెన్స్ వర్తించబోద‌ని అంటున్నారు క్రీడా విశ్లేష‌కులు. టోర్నమెంటు ప్రారంభమైన తర్వాత మధ్యలో గాయపడితే ఆయా ఫ్రాంచైజీ తరఫున పరిహారం లభించే ఛాన్సులు ఉంటాయి. అలాగే ఇన్సూరెన్స్ ద్వారా 50% ఆ ప్లేయర్ కు వర్తిస్తుందట. భారత రాజ్యాంగ చట్ట పరిధిలోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన అంశం కావడంతో ఏ ఒక్క విదేశీ ప్లేయర్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ద్వారా పరిహారం పొందాలని ఆలోచన చేయబోరని చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తే ముస్తాఫిజుర్ రహమాన్ కు ఈ సారి ఒక్క రూపాయి కూడా ఫ్రాంచైజీ నుంచి రాబోదన్నమాట. దీనివల్ల అతను తీవ్రంగా నష్టపోతాడు. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ కు దూరమైన ముస్తాఫిజుర్ రహమాన్, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇండియాపై పగ, పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లోకి ముస్తాఫిజుర్ ?

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఆడకుండా ముస్తాఫిజర్ రహమాన్ పైన బీసీసీఐ వేటు వేసిన నేపథ్యంలో సరికొత్త కుట్ర తెరపైకి వచ్చింది. బీసీసీఐ వేటు వేసిన నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ కు ఒక్క రూపాయి కూడా రాదు. ఈ విషయం గ్రహించిన బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్, బిసిసిఐకి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. బిసిసిఐ ఆడించకపోతే ఏంటి? తాను పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్లో ఆడతానని ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాడట. ఈ మేరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ యాజమాన్యంతో చర్చలు కూడా జరుపుతున్నాడట ముస్తాఫిజుర్. ఇండియాను కాదనుకొని వచ్చిన ముస్తాఫిజుర్ రహమాన్ కు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజ‌యం

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×