Obstructing The Field: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) చివరి అంకానికి వచ్చింది. ఈ టోర్నమెంటులో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ పేషావర్ జల్మీ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ ( Peshawar Zalmi vs Hyderabad Kingsmen) జట్ల మధ్య జరుగుతోంది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం ( Gaddafi Stadium, Lahore) వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కింగ్స్ మెన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 18 ఓవర్లు ఆడిన హైదరాబాద్ కింగ్స్ మెన్, 129 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, ఈ మ్యాచ్ లో వివాదస్పద రనౌట్ ( obstructing the field) అయింది.
Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫైనల్స్ లో వివాదస్పద రనౌట్ సంఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ ఆటగాడు కుశాల్ పెరెరా ( Kusal Perera) రనౌట్ అయ్యాడు. సైమ్ అయూబ్ ( Saim Ayub) ఫ్రంట్ ఫీల్డర్ బ్రాస్ వెల్ వైపు షాట్ ఆడగా, మరో వైపు ఉన్న బ్యాటర్ కుశాల్ పెరెరాను బౌలర్ నహిద్ రానా పరుగు తీయకుండా అడ్డు తగిలాడు. ఈ క్రమంలో సరైన సమయానికి క్రీజుకు చేరుకోలేదు కుశాల్ పెరెరా. అంతలోనే బ్రెస్ వెల్ వికెట్లను బాదేశాడు. ఈ క్రమంలో కుశాల్ పెరెరా రనౌట్ అయ్యాడు. అచ్చం కేకేఆర్ ఆటగాడు రఘువంశీ రనౌట్ ( obstructing the field) అయిన తరహాలోనే ఇక్కడ కుశాల్ పెరేరా కూడా వెనుతిరగాల్సి వచ్చింది. కానీ పీఎస్ఎల్ లో బ్యాటర్ ను బౌలర్ అడ్డగించగా.. ఐపీఎల్ సందర్భంగా రఘువంశీ బంతిని కావాలనే ఆపే ప్రయత్నం చేశాడని అంపైర్లు నిర్ధారించుకొని ఔట్ ఇచ్చారు. దీంతో తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన కుశాల్ పెరెరా రనౌట్ వివాదంగా మారింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పెషావర్ జల్మీ, హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్ల మధ్య ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ రూల్ ప్రకారం హైదరాబాద్ ఆటగాడు కుశాల్ పెరెరా ( Kusal Perera) రనౌట్ అయ్యాడు. దీంతో అసలు అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ అంటే ఏంటి అనే చర్చ జరుగుతోంది. దీని ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఒక బ్యాటర్, ఫీల్డింగ్ చేస్తున్న జట్టును అడ్డుకునే ప్రయత్నం చేయడం. ఈ నేపథ్యంలో ఫీల్డర్లు అప్పీల్ చేస్తే, అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఆ ఆటగాన్ని ఔట్ గా ప్రకటిస్తారు.
ఇది క్రికెట్ చట్టాలలో 37వ లా కిందికి వస్తుందని అంటున్నారు. రనౌట్ కాకుండా తప్పించుకునేందుకు బ్యాటర్ ప్రయత్నించడం.. పరుగుల మధ్యలో బంతిని అడ్డుకోవడం, ఫీల్డర్ క్యాచ్ పట్టుకోకుండా అడ్డుకోవడం లాంటి సంఘటనలు ఇందులోకి వస్తాయి. అయితే తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా బ్యాటర్ ను బౌలర్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కుశాల్ పెరెరా రనౌట్ అయ్యాడు. ఇది కూడా అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వస్తుందా ? లేదా ? దీనికి ఏమైనా రూల్ ఉంటుందా ? అనే చర్చ జరుగుతోంది. కొందరు ఇదే అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ రూల్ కిందికి వస్తుందని అంటుంటే.. మరికొంతమంది రాదని అంటున్నారు.
Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండగా రొమాన్స్..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైరల్
A controversial runout in the PSL 2026 Final. 😳pic.twitter.com/GLmfm8fpq0
— Sheri. (@CallMeSheri1_) May 3, 2026