E-Paper
Advertisement

Kamran Akmal: ఆసియా క‌ప్ లాగానే బంగ్లాదేశ్ నుంచి ట్రోఫీ దొంగ‌త‌నం చేయ్..న‌ఖ్వీ ఇజ్జ‌త్ తీసిన అక్మ‌ల్

Kamran Akmal: ఆసియా క‌ప్ లాగానే బంగ్లాదేశ్ నుంచి ట్రోఫీ దొంగ‌త‌నం చేయ్..న‌ఖ్వీ ఇజ్జ‌త్ తీసిన అక్మ‌ల్
Advertisement

Kamran On Naqvi:  బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan) చిత్తుగా ఓడింది. 3 వన్డేల సిరీస్ ను బంగ్లాదేశ్ చేతిలో కోల్పోయింది పాకిస్తాన్. దాదాపు 11 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయిన చెత్త రికార్డు నమోదు చేసుకుంది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోక్షం నక్విపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ( Pak Kamran Akmal). నీకు దొంగతనం చేసే అలవాటు ఉంది కదా ? బంగ్లాదేశ్ గెలిచిన ట్రోఫీని కూడా దొంగతనం చేసి తీసుకురా అంటూ పరువు తీశారు. ఆసియా కప్ 2025 ట్రోఫీని ( Asia Cup 2025) తీసుకువచ్చినట్లుగానే, బంగ్లాదేశ్ గెలిచిన వన్డే ట్రోఫీని కూడా పాకిస్తాన్ తీసుకురావ‌చ్చు క‌దా ? అంటూ దారుణంగా కామెంట్లు చేసి, ర్యాంగింగ్ చేశారు కమ్రాన్ అక్మల్.

Also Read: SRH-Abrar Ahmed: కావ్య పాపకు విల‌న్ గా మారిన‌ మొహ్సిన్ నఖ్వీ…స‌న్ రైజ‌ర్స్ కు అబ్రార్ అహ్మద్ ఆడ‌కుండా కుట్ర‌లు !

ఆసియా క‌ప్ లాగానే బంగ్లాదేశ్ నుంచి ట్రోఫీ దొంగ‌త‌నం చేయ్

Advertisement

బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ( Pak Kamran Akmal) కూడా దీనిపై స్పందించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ (Mohsin Naqvi ), పాకిస్తాన్ క్రికెటర్ల పై దారుణంగా కామెంట్లు చేశారు. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టును చూసి అందరూ వెక్కిరిస్తున్నారని ఫైరయ్యారు. పదవ ర్యాంకు ఉన్న బంగ్లాదేశ్ చేతిలో ఎలా ఓడిపోతారని నిలదీశారు. పాకిస్తాన్ ఇలాగే ఆడితే, ఎవడు మిమ్మల్ని కాపాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ జట్టును కూడా నెదర్లాండ్ లాంటి జట్లు ఓడించేందుకు సిద్ధమవుతున్నాయని చురకలు అంటించారు.

పాకిస్తాన్ పై భవిష్యత్తులో మూడు మ్యాచ్ ల సిరీస్ ఆడి.. చిత్తుగా ఓడించుదామని నెదర్లాండ్స్ లాంటి జట్లు కూడా తొడలు కొడతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా పాకిస్తాన్ ప్లేయర్లు తమ బుద్ధి మార్చుకోవాలని మండిపడ్డారు. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ పరువు తీశారు కమ్రాన్ అక్మల్. గ్రౌండ్ లో క్రికెట్ ఆడడం చేతకాదు.. ఎలాగూ ఆసియా కప్ దొంగతనం చేశావు కదా ? ఇప్పుడు బంగ్లాదేశ్ గెలిచిన వన్డే సిరీస్ ట్రోఫీని కూడా మెల్లిగా దొంగతనం చేసుకొని పాకిస్తాన్ తీసుకురా అంటూ దారుణంగా ర్యాగింగ్ చేశాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ ఆసియా కప్ టైటిల్ దొంగలించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ గెలిచిన త‌ర్వాత‌, టీమిండియాకు అందించకుండా…మొహ్సిన్ న‌ఖ్వీ పారిప‌యాడు. ఆ టైటిల్ ను త‌న ఆఫీసులోనే పెట్టుకున్నాడు.

Advertisement

Also Read: World Cup 2027: టీమిండియా ఓపెన‌ర్లుగా రోహిత్, కోహ్లీ..గిల్ కు నో ఛాన్స్‌..వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమ్ ఇదే !

 

 

 

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×