E-Paper
Advertisement

T20 World Cup 2026: జై షా దెబ్బ అదుర్స్‌..ప్రపంచ కప్ ఆడే పాకిస్తాన్ జట్టు ప్ర‌క‌ట‌న‌..రిజ్వాన్‌, హారిస్ రవూఫ్ కు నో ఛాన్స్‌

T20 World Cup 2026: జై షా దెబ్బ అదుర్స్‌..ప్రపంచ కప్ ఆడే పాకిస్తాన్ జట్టు ప్ర‌క‌ట‌న‌..రిజ్వాన్‌, హారిస్ రవూఫ్ కు నో ఛాన్స్‌

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Mens T20 World Cup 2026 ) నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. నిన్నటి వరకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడబోమంటూ డ్రామాలు చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… ఇవాళ తమ జట్టును ( Pakistan T20 World Cup squad ) మాత్రం ప్రకటించింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తూ, అధికారిక ప్రకటన చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ టి20 ప్రపంచ కప్ ఆడే పాకిస్తాన్ జట్టు (Pakistan) కెప్టెన్ గా సల్మాన్ అలీ అఘాను అంద‌రూ ఊహించిన‌ట్లుగానే ఫిక్స్ చేసింది పాకిస్తాన్‌. అటు బాబ‌ర్ ఆజంకు ఛాన్స్ ఇచ్చింది.

Also Read: Smriti-Palash Muchhal: ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు..బెడ్ రూం నుంచి లాక్కొచ్చి మ‌రీ

T20 ప్రపంచ కప్ ఆడే పాకిస్తాన్ జట్టు ప్ర‌క‌ట‌న‌

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడే జట్టును ఇవాళ ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇప్పటికే అన్ని జట్లు ఈ టోర్నమెంట్ కు సిద్ధం కాగా, చాలా ఆలస్యంగా తమ జట్టును ప్రకటించింది పాకిస్తాన్. నిన్నటి వరకు అసలు ఈ టోర్నమెంట్ ఆడబోమంటూ డ్రామాలాడింది. అయితే ఐసీసీ నుంచి కీలక ఆదేశాలు వచ్చాయట. ఈసారి టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే, ఆసియా కప్ నుంచి తొలగిస్తామని హెచ్చరించిందట. అలాగే ఆర్థికంగా నిధులను కూడా ఐసీసీ ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చిందట.

ర్యాంకింగ్స్ తొలగిస్తామని, ఇకపై వరల్డ్ కప్ పాడకుండా చేస్తామని ఐసీసీ బాస్ జై షా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బకు ఇవాళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టు ను ప్రకటించేసింది. ఈ జట్టుకు ( Pakistan T20 World Cup squad ) కెప్టెన్ గా సల్మాన్ అలీ అఘా ఉండనున్నాడు. బాబర్ ఆజంకు ( Babar Azam) ఛాన్స్ వచ్చింది. షాహిన్ షా ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్, జమాన్, డేంజర్ ఆటగాడు ఫర్హాన్ లాంటివాళ్ళు ఈ టోర్నమెంట్ కు సెలెక్ట్ అయ్యారు. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంటులో ఓవరాక్షన్ చేసిన హ‌రీస్ రావుఫ్ ను ( Haris Rauf) దూరం పెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ). ఆసియా కప్ 2025 టోర్నమెంటు నుంచి హ‌రీస్ ర‌వూఫ్ సరిగ్గా ఆడ‌టం లేదు. అత‌ని ప‌ర్ఫామెన్స్ స‌రిగ్గాలేదు. దీంతో హ‌రీస్ ర‌వూఫ్ ను సెల‌క్ట్ చేయ‌లేదు. రిజ్వాన్ కు కూడా ఛాన్స్ ద‌క్క‌లేదు.

T20 ప్రపంచ కప్ ఆడే 15 మంది సభ్యుల పాకిస్తాన్ జ‌ట్టు

పాకిస్తాన్ జ‌ట్టు ( Pakistan): సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫాయ్ (వికె), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్), సయీమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (Wk) మరియు ఉస్మాన్ తారిఖ్.

Also Read:  Tanveer Ahmed: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ సిక్సులు కొడితే, పాకిస్తాన్ వీధుల్లో న‌గ్నంగా తిరుగుతా

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×