IND VS PAK: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ శ్రీలంకలోని కొలంబో వేదికగా బిగ్ ఫైట్ జరుగుతోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan Match) రెండు బలమైన జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన, పాకిస్తాన్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ టాస్ సందర్భంగా మరోసారి పాకిస్తాన్ ను అవమానించాడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే సైడ్ అయ్యాడు టీమిండియా సారధి సూర్య కుమార్ యాదవ్.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మరికాసేపట్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో టాస్ ఓడిపోయినప్పటికీ… టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ వేదికగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా లైవ్ వస్తోంది.
ఇవాల్టి మ్యాచ్ నేపథ్యంలో అభిషేక్ శర్మ తుది జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అడిగినట్లుగానే అభిషేక్ శర్మను తెరపైకి తీసుకువచ్చాడు సూర్య కుమార్ యాదవ్. అటు అర్ష దీప్ సింగ్ ను జడ్జిలోంచి తొలగించి కుల్దీప్ యాదవ్ ను తీసుకువచ్చారు. ఇది ఇలా ఉండగా టాస్ సందర్భంగా మరోసారి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అందరూ ఊహించినట్లుగానే మరోసారి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించాడు సూర్య భాయ్. కాగా ఇవాళ ప్రేమదాస స్టేడియంలో వర్షం పడుతుందని అన్నారు. కానీ వర్షం మాత్రం పడలేదు. దీంతో మ్యాచ్ ముందుగా ఫిక్స్ చేసిన సమయం ప్రకారం ప్రారంభం అయింది.
పాకిస్తాన్ తో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో 4 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అటు ఇషాన్ కిషన్ మాత్రం అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు.
India (Playing XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
Pakistan (Playing XI): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(w), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్
No handshake between Suryakumar Yadav and Salman Ali Agha after the toss!
📸: JioHotstar#T20WorldCup2026 #INDvsPAK #SuryakumarYadav #CricketTwitter pic.twitter.com/EuhRT9liXi
— InsideSport (@InsideSportIND) February 15, 2026