E-Paper
Advertisement

AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌
Advertisement

AUS vs ZIM-IND WC Wins:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇండియా వరుసగా విజయాలు నమోదు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో ఈ సారి ఇండియా టైటిల్ గెలుస్తుందని అందరూ అంటున్నారు. దానికి తగ్గట్టుగానే జింబాబ్వే ( zimbabwe ) సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. ఐసీసీ నిర్వహించిన టోర్నమెంట్స్ లో ఆస్ట్రేలియాను ( australia) జింబాబ్వే ఓడిస్తే ఇండియా గెలుస్తోంది. ఆ టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలుస్తోంది. 1983 అలాగే 2007 సంవత్సరాలలో ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఈ 2026 T20 ప్రపంచ కప్ టోర్నమెంటులో కూడా ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది. దీంతో ఇండియా నే ( Team India) ఛాంపియన్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు.

Also Read: Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌ 

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఇండియా అద్భుతంగా రాణిస్తోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు మ్యాచ్లు విజయం సాధించిన టీమిండియా రేపు పాకిస్తాన్ తో తలపడుతుంది. అందులో విజయం సాధిస్తే సూపర్ 8లోకి దూసుకు వెళ్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో సెంటిమెంట్ టీమిండియాకు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. శుక్రవారం జరిగిన జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో అనుకోని సంఘటన జరిగింది. బలమైన ఆస్ట్రేలియా జట్టును జింబాబ్వే చిత్తుగా ఓడించింది. అయితే ఈ ఐసీసీ టోర్నమెంట్ లో ఎప్పుడైతే ఆస్ట్రేలియాలో జింబాబ్వే ఓడిస్తుందో.. ఆ టోర్నమెంట్ లో ఇండియా ఛాంపియన్ అవుతోంది.

1983 సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఆ సమయంలో 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ( Australia) జింబాబ్వే ( Zimbabwe) ఓడించింది. దీంతో ఫైనల్ లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో తొలి వన్డే వరల్డ్ కప్ గెలిచింది ఇండియా. ఇక 2007లో ఐదు వికెట్ల తేడాతో టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాను ఓడించింది జింబాబ్వే. అప్పుడు కూడా ధోని ( Ms Dhoni) కెప్టెన్సీలోని టీమిండియా టి20 ప్రపంచ కప్ తొలి ట్రోఫీని అందుకుంది. ఇక ఇప్పుడు 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది జింబాబ్వే. అంటే పైన పేర్కొన్న సెంటిమెంట్ ప్రకారం 2026 టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటును సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లోని టీమ్ ఇండియా గెలుచుకోనుంది అన్నమాట. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇండియాలోనే జరుగుతోంది. ఇది టీమిండియా జట్టుకు కాస్త అడ్వాంటేజ్ కానుంది. ఇక జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా సెంటిమెంట్ ప్రకారం అన్ని వర్కౌట్ అయితే కచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ సేన టైటిల్ ఎగురేసుకు వెళ్ళనుంది

Advertisement

Also Read: Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×