Ali Raza Run Out: ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Under 19 World Cup 2026 )భాగంగా శుక్రవారం రోజున కీలక మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్ అండర్ 19 వర్సెస్ ఇంగ్లాండ్ అండర్ 19 జట్ల ( Pakistan U19 vs England U19, 4th Match ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడు అలీ రజా ( Ali Raza ) ఓవరాక్షన్ కారణంగా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. చివరి వికెట్ కు బ్యాటింగ్ కు వచ్చిన అలీ రాజా, పరుగు తీస్తున్నట్లు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ థామస్ రెవ్ ను ( Thomas Rew ) కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ తెలివిగా వ్యవహరించిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ థామస్ రెవ్, అలీ రాజా ను ఔట్ చేశాడు. ఫీల్డర్ బెన్ వేసిన బంతిని వెంటనే వికెట్లకు బాదేసి, పాకిస్తాన్ ఆటగాడు అలీ రాజాకు షాక్ ఇచ్చాడు. దీంతో అలీ రాజా రన్ అవుట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు పాకిస్తాన్ ఆటగాడు అలీ రాజా ( Ali Raza Run Out ) వ్యవహారం తయారైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు… పాకిస్తాన్ పరువు తీస్తున్నారు.
ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న హరారే వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 46.5 ఓవర్లలో 210 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. లక్ష్యం చిన్నదైనప్పటికీ ఛేదించడంలో దారుణంగా విఫలమైంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో 46.3 ఓవర్లు వాడిన పాకిస్తాన్ 173 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో ఈ మ్యాచ్లో 37 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ అండర్ 19 జట్టు విజయం సాధించింది.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నిన్నటి వన్డే మ్యాచ్ సందర్భంగా బౌలర్ అలీ రాజా రన్ అవుట్ హాట్ టాపిక్ అయింది. చివరికి బ్యాటింగ్ చేసిన అలీ రాజా ( Ali Raza ) … మ్యాచ్ గెలిచే సమయంలో వికెట్ సమర్పించుకున్నాడు. వికెట్ కీపర్ థామస్ రెవ్ ను ( Thomas Rew ) కన్ఫ్యూజ్ చేయాలని, క్రీజు వదిలి బయటకు వచ్చి గేమ్స్ ఆడాడు. అయితే దాన్ని క్యాచ్ చేసిన థామస్, వెంటనే బంతి తీసుకొని వికెట్లను గిరాటేశాడు. ఫలితంగా అలీ రాజా రన్ అవుట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. అయితే అలీ రాజా రన్ అవుట్ అయిన వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Pakistani low IQ players try to act over smart
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
— Space Recorder (@1spacerecorder) January 16, 2026