E-Paper
Advertisement

Babar Azam-Steve Smith: బాబర్ ఆజాంకు స్ట్రైక్ ఇవ్వకుండా పరువు తీసిన స్మిత్..బ్యాట్ నెల‌కొట్టి రెచ్చిపోయిన పాక్ బ్యాట‌ర్‌

Babar Azam-Steve Smith: బాబర్ ఆజాంకు స్ట్రైక్ ఇవ్వకుండా పరువు తీసిన స్మిత్..బ్యాట్ నెల‌కొట్టి రెచ్చిపోయిన పాక్ బ్యాట‌ర్‌
Advertisement

Babar Azam-Steve Smith: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) పరువు తీశాడు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్. బాబర్ ఆజంకు ( Babar Azam ) స్ట్రైక్ ఇవ్వకుండా, ఇజ్జత్ తీసాడు. ఈ సంఘటన బిగ్ బాష్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Big Bash League 2025-26) భాగంగా శుక్రవారం చోటుచేసుకుంది. బిగ్ బాస్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా శుక్రవారం సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ సిడ్నీ థండర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే సిడ్డీ సిక్సర్స్ జట్టు తరుపున స్టీవెన్ స్మిత్ అలాగే బాబర్ ఆజం ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓపెనర్ గా దిగిన ఇద్దరు అద్భుతంగా రాణించారు. అయితే బాబ‌ర్ ఆజాం కాస్త స్లోగా ఆడిన నేపథ్యంలో… అతనికి స్ట్రైక్ ఇవ్వలేదు స్టీవెన్ స్మిత్. ఈ ఫ్రస్టేషన్ లో బాబర్ ఆజం క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తన అర్థ సెంచరీ కూడా మిస్ చేసుకున్నాడు. అనంతరం స్మిత్ పైన కోపంతో బ్యాటర్ ను నేలకేసి కొట్టి పెవిలియన్ కు వెళ్లిపోయాడు బాబ‌ర్ ఆజం. ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read: T20 World Cup 2026: ఇండియ‌న్ ఏజెంట్ కామెంట్స్‌..BCBపై బంగ్లా క్రికెట‌ర్ల తిరుగుబాటు, వాడు రాజీనామా చేయాలంటూ

బ్యాట్ నెల‌కొట్టి రెచ్చిపోయిన బాబర్ ఆజం

Advertisement

బిగ్ బాష్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా శుక్రవారం రోజున సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ సిడ్నీ థండ‌ర్ ( Sydney Sixers vs Sydney Thunder) జ‌ట్ల మధ్య 37వ మ్యాచ్ జరిగింది. సిడ్నీ గ్రౌండ్ జరిగిన ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండ‌ర్‌ జట్టు నిర్ణీత‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 189 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి 110 పరుగులు సాధించాడు. అయితే డేవిడ్ వార్నర్ సెంచరీ చేసినప్పటికీ కూడా సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సిడ్నీ థండర్ జట్టు పైన సిడ్నీ సిక్సర్స్ ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 189 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో బాబర్ ఆజం అలాగే స్టీవెన్ స్మిత్ అద్భుతంగా ఆడారు. స్టీవెన్ స్మిత్ సెంచరీ చేయగా బాబర్ ఆజం 47 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

ఒకే ఓవ‌ర్ లో 32 ప‌రుగులు సాధించిన స్మిత్‌

47 పరుగుల వద్ద బాబర్ ఆజం ఉన్నప్పుడు, అతనికి ఘోర‌ అవమానం జరిగింది. 11వ ఓవర్ లో వరుసగా మూడు బాల్స్ డాట్ చేశాడు బాబ‌ర్ ఆజం. చివరి బంతికి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే అవతలి వైపు ఉన్న స్టీవెన్ స్మిత్ మాత్రం పరుగుకు రాలేదు. వెళ్ళిపో అంటూ హెచ్చరించాడు. దీంతో అసహనానికి గురైన బాబ‌ర్‌… ఆ తర్వాత 47 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ స్టీవెన్ స్మిత్ మాత్రం సింగిల్ నిరాకరించిన తర్వాతి ఓవర్ లో ఏకంగా 32 పరుగులు సాధించాడు. ఇందులో వరుసగా 4 సిక్సర్లు ఒక బౌండరీ కూడా ఉంది. అయితే 47 పరుగుల వద్ద వికెట్ కోల్పోవడంతో స్మిత్ పైన కోపంతో బాబర్ ఆజం ర‌గిలిపోయాడు. పెవిలీయ‌న్ కు వెళ్లేట‌ప్పుడు బ్యాట్ ను నెల‌కేసి కొట్టేశాడు. ఈ సంఘ‌ట‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

Advertisement

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×