E-Paper
Advertisement

Usman Tariq On Team India: ట్విన్ టవర్స్ లాగా టీమిండియా టాపార్డ‌ర్ కూల్చేస్తా..నిద్ర‌లోనూ భ‌య‌ప‌డేలా చేస్తా !

Usman Tariq On Team India: ట్విన్ టవర్స్ లాగా టీమిండియా టాపార్డ‌ర్ కూల్చేస్తా..నిద్ర‌లోనూ భ‌య‌ప‌డేలా చేస్తా !

Usman Tariq On Team India:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan) మధ్య శివరాత్రి రోజు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటినుంచే రెండు జట్లు ప్రిపేర్ అవుతున్నాయి. ఇవాళ నమీబియా పైన విజయం సాధించి పాకిస్తాన్ కోట బద్దలు కొట్టాలని సూర్యకుమార్ యాదవ్ సేన సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న ఈ మ్యాచ్ కు కొలంబో ( Colombo) వేదిక కానుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు  ( Team India Cricketer) స్ట్రాంగ్ వార్నింగ్ పంపించాడు పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ( Usman Tariq). తన బౌలింగ్ అంటే ఇండియన్స్ భయపడుతున్నారని.. అందుకే తనపై విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన ట్విన్ టవర్స్ కూల్చినట్టే టీమిండియా కాపాడరు కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు ఉస్మాన్ తారిక్. దీంతో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Trolls on Usman Tariq: ఐసీసీ కళ్లు మూసుకుపోయాయా ? ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ వేయండి..USA, శ్రీలంక ఫ్యాన్స్ ట్రోలింగ్‌

ట్విన్ టవర్స్ లాగా టీమిండియా టాపార్డ‌ర్ కూల్చేస్తా

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 15 కు పైగా మ్యాచులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొన్నటి వరకు అసలు ఈ మ్యాచ్ జరగడం పైన సందిగ్ధత నెలకొంది. కానీ చివరికి పాకిస్తాన్ దిగివచ్చి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan) మ్యాచ్ జరగడం ఖాయమని తేలడంతో రెండు జట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీమిండియాను ఓడిస్తామని పాకిస్తాన్ క్రికెటర్లు అంటుంటే…. పాకిస్తాన్ ను నలిపేస్తామని ఇండియన్స్ హెచ్చరిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా ఇండియాతో జరిగే మ్యాచ్ పై పాకిస్తాన్ మిస్టరీ స్పిన్న‌ర్ ఉస్మాన్ తారిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బౌలింగ్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇండియన్స్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఐసీసీ రూల్స్ ప్రకారం తన బౌలింగ్ కరెక్టేనని వివరించారు. తన బౌలింగ్ అంటే భయపడి ఇండియన్స్ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 15వ తేదీన ట్విన్ టవర్స్ కూల్చేసిన‌ట్లు.. ఇండియన్ టాప్ ఆర్డర్ ను కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ మిస్టరీ స్పిన్న‌ర్ ఉస్మాన్ తారిక్. త‌న బౌలింగ్ తో టీమిండియా ప్లేయ‌ర్ల‌కు కాలరాత్రి మిగుల్చుతాన‌ని వార్నింగ్ ఇచ్చాడు.

Also Read: BAN – T20 WC Boycott: మా బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు, పిరికి స‌న్నాసులు..మాట మార్చిన ఆసిఫ్ నజ్రుల్

 

?utm_source=ig_web_copy_link

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×