BAN – T20 WC Boycott: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ దూరమైంది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ రంగంలోకి దిగి దూసుకు వెళ్తోంది. ఇండియాలో భద్రతా కారణాలు చూపించి, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటును బహిష్కరించింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ సర్కార్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. అయితే ఇప్పుడు అక్కడి బంగ్లాదేశ్ ప్రభుత్వం మాట మార్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ క్రికెటర్లు, BCB భయపడిపోయారని.. వాళ్ల నిర్ణయం మేరకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ బహిష్కరించినట్లు బంగ్లాదేశ్ క్రీడా మంత్రి ఆసిఫ్ నజ్రుల్ ( Asif Nazrul) షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతకు ముందు తమ ప్రభుత్వం ( Bangladesh Govt ) నిర్ణయం మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బహిష్కరించినట్లు వెల్లడించారు. కానీ ఇప్పుడు మాట మార్చి బంగ్లాదేశ్ క్రికెటర్ల పరువు తీశాడు ఆసిఫ్ నజ్రుల్. మా బంగ్లాదేశ్ క్రికెటర్లు చేతకాని దద్దమ్మలు, పిరికి సన్నాసులు అంటూ ఇరికించేశాడు.
Also Read: Bhanuka LibraryRajapaksa: ఇండియన్ బ్యాట్లలో రబ్బర్లు, అందుకే భయంకరంగా ఆడుతున్నారు..విషం కక్కిన శ్రీలంక ప్లేయర్
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నుంచి బంగ్లాదేశ్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో… ముస్తాఫిజుర్ రహమాన్ ఆడకుండా బ్యాన్ విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో భద్రత కారణాలు చూపించి టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇండియాలో ఆడబోమని డ్రామాలు మొదలుపెట్టింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెటర్లకు కూడా ఆదేశాలు ఇచ్చింది. టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో ఆడకూడదని బంగ్లాదేశ్ సర్కార్ మొదట పేర్కొంది. బంగ్లాదేశ్ క్రీడా మంత్రి ఆసిఫ్ నజ్రుల్ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు.
భద్రతా కారణాల వల్ల తమ జట్టు ఇండియాలో ( India) పర్యటించబోదని.. శ్రీలంకలో మ్యాచ్ లు నిర్వహించాలని కోరారు. కానీ దానికి ఐసీసీ ఒప్పుకోకపోవడంతో బహిష్కరించింది బంగ్లాదేశ్. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ క్రీడ మంత్రి ఆసిఫ్ నజ్రుల్ మాట మార్చారు. ఇండియా వెళ్లాలని బంగ్లాదేశ్ క్రికెటర్లకు చెప్పినప్పటికీ… వాళ్లు వెళ్లలేదని మాట మార్చాడు. ఇండియాలో పర్యటించేందుకు బంగ్లాదేశ్ క్రికెటర్లు భయపడిపోయారని.. టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) బహిష్కరించిన నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh Cricket Board ) దేనిని వెల్లడించారు. బహిష్కరణ నిర్ణయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు ఆసిఫ్ నజ్రుల్ ( Asif Nazrul) . దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ప్లేయర్లను అడ్డంగా ఇరికించి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం తప్పుకుందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Also Read: PAK VS USA: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై అనుమానాలు…USAపై పాకిస్తాన్ విజయం, సూపర్ 8లోకి ఎంట్రీ !
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Bangladesh sports advisor Asif Nazrul says the decision to skip the T20 World Cup 2026 was made by the players and the BCB, not the government. 🇧🇩👀
(Source: Cricbuzz)#Bangladesh #T20WorldCup #Sportskeeda pic.twitter.com/UL7jEPwR7U
— Sportskeeda (@Sportskeeda) February 11, 2026