Saim Ayub: పాకిస్తాన్ క్రికెట్ పరువు రోజు రోజుకు దిగజారుతోంది. పసికూన జట్ల చేతుల్లో కూడా దారుణంగా ఓడిపోతోంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan cricket team). అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరించే తీరుపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ పై (Pakistan Super League 2026 Tournament) కూడా అనేక రకాల విమర్శలు వచ్చాయి. మొన్న బంగ్లాదేశ్ చేతిలో తొలి టెస్ట్ కూడా చాలా దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ పై ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇలాంటి క్రమంలో మరో ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ సైమ్ అయూబ్ (Saim Ayub) 9 ఏళ్ల కుర్రాడి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
గత ఏడాది కాలంగా పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ సైమ్ అయూబ్ (Saim Ayub) చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా కూడా ఏమాత్రం రాణించలేదు. ఇటు పాకిస్తాన్ సూపర్ లీ 2026 టోర్నమెంట్ సందర్భంగా కూడా అట్టర్ ప్లాప్ అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ కు కూడా ఇతన్ని పక్కకు పెట్టారు. అయితే ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ ఓపెనర్ సైమ్ అయూబ్ పరువు పోయే సంఘటన చోటు చేసుకుంది. ఓ 9 ఏళ్ల స్కూల్ విద్యార్థి చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు సైమ్ అయూబ్. కరాచీ లో ప్రాక్టీస్ సెషన్ జరుగింది. ఇందులో పాకిస్తాన్ ఓపెనర్ సైమ్ అయూబ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాకిస్తాన్ కంట్రీకి సంబంధించిన జిదాన్ బషీర్ అనే 9 సంవత్సరాల కుర్రాడు బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్ ఎదుర్కొనేందుకు కష్టపడ్డ సైమ్ అయూబ్… క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ కుర్రాడు వేసిన బంతికి వికెట్లు గిరాటేశాయి. అయితే వికెట్ కోల్పోయిన తర్వాత సైమ్ అయూబ్ ఉలిక్కిపడ్డాడు. ఈ బుడ్డోడు ఇలా వేస్తున్నాడు ఏంటి ? అని షాక్ అయ్యాడు. ఆ తర్వాత గ్రేట్ ఫ్యూచర్ అంటూ బషీర్ ను ప్రశంసించాడు సైమ్ అయూబ్. నిరాశపడకుండా అతన్ని మెచ్చుకున్నాడు. ఈ సంఘటన వైరల్ గా మారింది. అయితే దీనిపై క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 9 ఏళ్ల కుర్రాడు బౌలింగ్ లో ఆడటం చేతకాని ప్లేయర్లు అందరూ పాకిస్తాన్ జట్టులో ఉన్నారని ర్యాగింగ్ చేస్తున్నారు. సైమ్ అయూబ్ లాంటి వెధవలను మేపుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అసలు బుద్ధి లేదని ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.
Saim Ayub clean bowled by a school kid. 🤯 pic.twitter.com/JPiXuGKLv6
— Rayham. (@RayhamUnplugged) May 13, 2026