Powerful AC Cars 2026: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మండే ఎండల్లో కుటుంబంతో కలిసి ప్రయాణించడం చాలామందికి ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా వెనుక సీట్లలో కూర్చునే పిల్లలు, పెద్దలకు సరైన కూలింగ్ లేకపోతే ప్రయాణం అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే, రూ. 15 లక్షల బడ్జెట్ లో మంచి కూలింగ్ తో వచ్చే 7 సీటర్ కార్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కుటుంబాల కోసం తయారైన MPV కార్లు ఈ వేసవిలో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వీటిలో వెనుక సీట్లకు ప్రత్యేక ఏసీ వెంట్లు, పెద్ద క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు ఉండటంతో లాంగ్ డ్రైవ్‌లు కూడా సులభంగా మారుతున్నాయి. ఇంతకీ రూ. 15 లక్షలలోపు బెస్ట్ ఏసీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్ల ఓ మంచి ఆదరణ పొందిన 7 సీటర్ కారు ఇది. ఇందులో రూఫ్ మీద అమర్చిన ప్రత్యేక ఏసీ వెంట్లు ఉంటాయి. దీంతో మూడో వరుసలో కూర్చునే వారికి కూడా మంచి కూలింగ్ అందుతుంది. మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, సౌకర్యవంతమైన క్యాబిన్ కారణంగా కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది.
అదే ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన రూమియన్ కూడా మరో మంచి ఆప్షన్. టయోటా బ్రాండ్ పై నమ్మకం ఉన్నవారికి ఇది బాగా నచ్చుతుంది. ఇందులో కూడా మంచి ఏసీ కూలింగ్, ప్రీమియం ఇంటీరియర్, సాఫ్ట్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ లభిస్తాయి. దీనిపై ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో డీలర్లు డిస్కౌంట్లు కూడా అందిస్తున్నారు.
తక్కువ బడ్జెట్ లో 7-సీటర్ కారు కావాలనుకునేవారికి రెనాల్ట్ ట్రైబర్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దేశంలో అత్యంత అందుబాటు ధరలో లభించే 7 సీటర్ కార్లలో ఇది ఒకటి. చిన్న కుటుంబాలకు చక్కగా సరిపోతుంది. డ్యూయల్ ఏసీ సెటప్ ఉండటంతో వెనుక ప్రయాణికులకు కూడా సరైన కూలింగ్ లభిస్తుంది.
కొంచెం స్ట్రాంగ్ కారు కావాలనుకునేవారు ఇది బెస్ట్ ఆప్షన్. గ్రామీణ రోడ్లు, కఠినమైన మార్గాల్లో కూడా ఈ వెహికల్ చక్కగా ప్రయాణిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్, బలమైన బాడీ కారణంగా కుటుంబ ప్రయాణాలకు సురక్షితంగా అనిపిస్తుంది.
టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి కియా కేరెన్స్ మంచి ఆప్షన్. ఇందులో వెనుక సీట్లకు ప్రత్యేక కూలింగ్ వెంట్లు, పెద్ద టచ్ స్క్రీన్, అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో దీని ఎంట్రీ లెవెల్ వేరియంట్లు రూ.15 లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 2 నుంచి 4 వారాల వరకు వెయిటింగ్ ఉండొచ్చని డీలర్లు చెబుతున్నారు.
Read Also: సాధారణ ఎయిర్ కలిగిన కార్ టైర్లలో నైట్రోజన్ గాలి కొట్టించవచ్చా? అలా చేస్తే ఏమవుతుంది?