Paul Van Meekeren Trolls Pak: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ ( Pakistan Team) బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ శనివారం రోజున ప్రారంభం కాగా తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ ( Pakistan vs Netherlands, 1st Match ) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మొదటి మ్యాచ్ లో ముప్పతప్పలు పడిన పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం, పాకిస్తాన్ పరువు తీస్తూ నెదర్లాండ్స్ జట్టుకు సంబంధించిన ఓ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరెక్ట్ గా ఫోకస్ చేయలేదు కానీ, కాస్త జాగ్రత్తగా ఆడుంటే పాకిస్తాన్ ఓడిపోయేదని చురకలు అంటించారు నెదర్లాండ్స్ జట్టుకు చెందిన బౌలర్ పాల్ వాన్ మికెరెన్ ( Paul van Meekeren).
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Men’s T20 World Cup 2026) భాగంగా శనివారం రోజున నెదర్లాండ్స్ జట్టుపైన పాకిస్తాన్ విజయం సాధించింది. అయితే మూడు వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్తాన్ పరువు తీశాడు ( Paul Van Meekeren Trolls Pak) నెదర్లాండ్స్ జట్టుకు చెందిన బౌలర్ పాల్ వాన్ మికెరెన్ ( Paul van Meekeren). తమపై గెలిచేందుకు పాకిస్తాన్ చాలా కష్టపడ్డదని వెల్లడించారు.
మూడు చెరువుల నీళ్లు తాగించామని… పాకిస్తాన్ ది అసలు గెలిపే కాదని ఇజ్జత్ తీశారు. పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో గెలవలేదు.. మేము చేజేతులా ఓడిపోయామని వెల్లడించారు పాల్ వాన్ మికెరెన్. 148 పరుగుల టార్గెట్ చేధనలో పాకిస్తాన్ చుక్కలు చూపించామని గుర్తు చేశారు. అయితే చివరి ఓవర్లలో ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోవడంతో ఓడిపోయినట్లు తప్పు ఒప్పుకున్నారు. అతి ముఖ్యంగా ఫహీమ్ అష్రఫ్ క్యాచ్ మిస్ చేయడం పెద్ద తప్పిదమైందని వెల్లడించారు. డెత్ ఓవర్ లో భాగంగా భారీగా పరుగులు ఇవ్వడం కారణంగా తమ జట్టు ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నెదర్లాండ్స్ బౌలర్ పాల్ వాన్ మికెరెన్ ( Paul van Meekeren).
పాకిస్తాన్ చేతిలో మొదటి మ్యాచ్ లోనే పోరాడి ఓడింది నెదర్లాండ్స్. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే 147 పరుగులు సాధించింది నెదర్లాండ్స్. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ కాస్త రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఓడిపోతుందని కూడా అందరు అనుకున్నారు. కానీ చివరికి 19.3 ఓవర్లలో నెదర్లాండ్స్ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది పాకిస్తాన్ క్రికెట్ టీం.
Paul Van Meekeren trolls Pakistan 🗣️
Paul said – “I want to be very clear, Pakistan didn’t win the game against us, we lost the game ourselves. That drop catch of Faheem Ashraf is still hurting us”.
What's your take 🤔 #INDvsUSA pic.twitter.com/X6QyIADWOw
— Richard Kettleborough (@RichKettle07) February 7, 2026
Would you agree with Paul van Meekeren’s statement after the Netherlands’ defeat to Pakistan? 🇳🇱👀#PAKvNED #T20WorldCup #Sportskeeda pic.twitter.com/nz7xbiXge4
— Sportskeeda (@Sportskeeda) February 7, 2026