E-Paper
Advertisement

Chandrahass: చాలా భయమేస్తుందంటూ.. ఏడ్చేసిన చంద్రహాస్!

Chandrahass: చాలా భయమేస్తుందంటూ.. ఏడ్చేసిన చంద్రహాస్!
Advertisement

Chandrahass: ‘నేను కొంతమందికి నచ్చుతుందేమోనని అలా పాట పాడాను. అది సినిమాపై ఎఫెక్ట్ పడుతుందేమోనని నాకు చాలా భయం వేస్తుంది సార్’ అంటూ చంద్రహాస్ (Chandrahass) ఎమోషనల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రహాస్ హీరోగా ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha) చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రహాస్ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా చేసిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. నిజమే, సినిమాపై అంత నమ్మకం ఉన్నప్పుడు అలాంటి నెగిటివ్ పబ్లిసిటీ జోలికి పోకుండా, ఉన్న కంటెంట్‌నే ఇంకా ప్రమోట్ చేసుకోవాల్సింది. అలా చేయకుండా, సినిమాకు సంబంధమే లేని ఓ బూతు పాటని పబ్లిగ్గా పాడి, అల్లరల్లరి అవుతున్నాడు చంద్రహాస్. అదేమని అంటే, లాయర్లు అనే స్టేజ్‌కి వెళ్లిపోయాడు.

Also Read- Family Drama OTT : పిల్లల కోసం ఆపసోపాలు… దత్తత తీసుకుని పడరాని పాట్లు… ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

పేరు తెచ్చేది మాత్రం క్రమశిక్షణే!

Advertisement

ఇప్పుడు తీరా సినిమా విడుదలైన తర్వాత భోరున విలపిస్తే ఎవరు నమ్ముతారు. ఎవరు ఓదార్చుతారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారెవరైనా సరే, క్రమశిక్షణతో ఉండాలి. నీ క్రమశిక్షణ ఇప్పుడు కాకపోతే ఇంకోసారైనా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. మంచి సక్సెస్‌ని ఇస్తుంది. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత డ్యాన్స్ చేసినా, ఎంతగా నటించినా, చివరికి నీకు పేరు తెచ్చేది మాత్రం క్రమశిక్షణే అనే విషయం ఇకనైనా చంద్రహాస్ గమనిస్తే మంచిది. అలా కాకుండా.. ఇంకా ఇంకా ఇలానే యాటిట్యూడ్ చూపించుకుంటూ వెళితే మాత్రం ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అనే డైలాగ్స్ వినాల్సి వస్తుంది. ఇకనైనా చంద్రహాస్ కాస్త జాగ్రత్తలు వహిస్తే, అతని కెరీర్‌కే బెటర్ అనేలా సినీ విమర్శకులు, నెటిజన్లు ఈ కుర్రహీరోకి సలహాలు ఇస్తున్నారు.

Also Read- Manchu Lakshmi: గ్రీన్ పార్క్ హోటల్‌లో మంచు లక్ష్మికి ఘోర అవమానం.. అసలేం జరిగిందంటే?

వెనుకా, ముందు ఆలోచించుకుంటే బెటర్

Advertisement

ఇక చంద్రహాస్ ఏడుపు విషయానికి వస్తే.. శనివారం ఈ సినిమాను హైదరాబాద్‌లోని ఏఎమ్‌బి సినిమాస్‌లో చూసేందుకు చిత్ర టీమ్ వెళ్లింది. అక్కడ థియేటర్‌లో తన సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో, తను పాడిన పాటే కారణమైందా? అది ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందా? అనేలా చంద్రహాస్ ఎమోషనల్ అయ్యాడు. పక్కనున్న చిత్రయూనిట్ అతడిని ఓదారుస్తున్నారు. ఏదైనా చేసే ముందు కాస్త వెనుకా, ముందు ఆలోచించుకుంటే బెటర్. సరే, అయిపోయిందేదో అయిపోయిందని, కనీసం సారీ చెప్పకుండా.. మళ్లీ ఎదురుగా యాటిట్యుడ్ ప్రదర్శిస్తూ వీడియోలు. ప్రేక్షకులేం పిచ్చోళ్లు కాదు.. ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి తెలుసు.. అనేలా నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా దారుణంగానే ఉన్నాయి కామెంట్స్. కానీ ఇక్కడ రాస్తే బాగోదు.

Also Read- 2027 Sankranthi: సంక్రాంతి బరిలో పవన్-సూరి బొమ్మ ఉంటే.. అంతా సర్దేసుకోవాల్సిందేనట!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×