PSL 2026 Finals: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 ) నెల రోజులకు పైగా ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక ఆదివారం రోజున పెషావర్ జల్మీ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ (Peshawar Zalmi vs Hyderabad Kingsmen, Final,) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం ( Gaddafi Stadium, Lahore) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన బాబర్ ఆజం సేన ఛాంపియన్ గా నిలిచింది. హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టుపైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది పెషావర్ జల్మీ. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో రెండోసారి టైటిల్ నెగ్గింది. ఈ క్రమంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ మ్యాచ్ లో బాబర్ ఆజం ( Babar Azam) డకౌట్ అయినప్పటికీ ఆరోన్ హార్డీ, అబ్దుల్ సమాద్ అదరగొట్టే బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. దీంతో హైదరాబాద్ కింగ్స్ మెన్ పైన విక్టరీ అందుకొని… ఛాంపియన్ గా నిలిచింది పెషావర్ జల్మీ.
Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేతగా పెషావర్ జల్మీ నిలిచింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం రోజున పెషావర్ జల్మీ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. లాహోర్ లోని గడాఫీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్ మెన్, 18 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 129 పరుగుల వద్ద కుప్పకూలింది హైదరాబాద్. ఇక ఈ లక్ష్యాన్ని ఆచితూచి చేదించింది పెషావర్ జల్మీ. 15.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించిన బాబర్ సేన, రెండోసారి ఛాంపియన్ అయింది. గతంలో 2017 సమయంలో ఫైనల్స్ లో గెలిచి ఛాంపియన్ అయిన పెషావర్ జల్మీ, ఇప్పుడు కూడా మరోసారి అయింది. 2017 సమయంలో డారెన్ సమీ ఆధ్వర్యంలో టైటిల్ గెలిచింది పెషావర్. ఇక ఇప్పుడు బాబర్ ఆజం నాయకత్వంలో ఇరగదీసింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఛాంపియన్ గా నిలిచింది బాబర్ సేన. హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టును చిత్తు చేసిన పెషావర్ జల్మీ అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో రెండోసారి టైటిల్ విజేతగా నిలిచింది పెషావర్ జల్మీ. అయితే ఈసారి ఛాంపియన్ గా నిలిచిన బాబర్ సేనకు భారీగా ప్రైజ్ మనీ దక్కనుంది. పెషావర్ జల్మీ జట్టుకు ఈ సారి రూ.4.18 కోట్లు అందించనుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అటు రన్నరప్ గా నిలిచిన హైదరాబాద్ కింగ్స్ మెన్ కు రూ.2.15 కోట్లు దక్కనున్నాయి.
Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండగా రొమాన్స్..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైరల్
– Darren Sammy in 2017.
– Babar Azam in 2026.PESHAWAR ZALMI ARE NOW TWO-TIME PSL CHAMPIONS. 🏆🟡 pic.twitter.com/s3AOO5GC1g
— Sheri. (@CallMeSheri1_) May 3, 2026