E-Paper
Advertisement

ఆటో డ్రైవర్ నుంచి గ్యాంగ్ స్టర్ అవతారం… కట్ చేస్తే కాటేరమ్మ జాతర మావా

ఆటో డ్రైవర్ నుంచి గ్యాంగ్ స్టర్ అవతారం… కట్ చేస్తే కాటేరమ్మ జాతర మావా
Advertisement

Crime Thriller OTT : ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఇంత క్రేజ్ దక్కడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే… విభిన్నమైన కంటెంట్ అంతా ఒకే ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంటుంది. ఒకే జానర్ లేదా అవి వచ్చినప్పుడే చూడడం వంటి పరిస్థితులు ఉండవు. ఇష్టం వచ్చిన సినిమాను, సిరీస్ ను ఇష్టం వచ్చిన టైంలో చూడొచ్చు. ఎన్నో జానర్లు అందుబాటులో ఉన్నా క్రైమ్ థ్రిల్లర్ స్పెషల్ అని చెప్పాలి. మీరు కూడా ఇలాంటి సినిమాలను ఇష్టపడితే ఈ మూవీ మీ కోసమే. మరి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సిరీస్ పేరు ‘ఆటో శంకర్’. దీనికి రంగ దర్శకత్వం వహించారు. ఇందులో అప్పాని శరత్ ప్రధాన పాత్రలో నటించగా… శరణ్య రవి, అర్జున్ చిదంబరం కతిరవన్, దేవ్ బాబు, వసుధ కూడా నటించారు. పేదరికంలో జీవిస్తున్న ఒక ఆటో డ్రైవర్, అతని భార్య సుమతి, వారి బిడ్డ స్టోరీనే ఇది. 1980లలో మద్రాసును భయభ్రాంతులకు గురిచేసిన ఒక గ్యాంగ్‌స్టర్ దారుణమైన కథ ఈ సిరీస్. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇది రియల్ స్టోరీ. ‘ఆటో శంకర్’ వెబ్ సిరీస్‌ ను తమిళ, కన్నడ, హిందీ, తెలుగు, మలయాళ భాషలలో ZEE5లో అందుబాటులో ఉంది. మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉండగా…. ప్రతి ఎపిసోడ్ 28 నుండి 34 నిమిషాల నిడివితో నడుస్తుంది. దీనికి IMDbలో 6.5 రేటింగ్ ఉండడం వీశేషం.

కథలోకి వెళ్తే…

Advertisement

స్వలాభం కోసం హింసకు పాల్పడే పోలీస్ అధికారి కతిరవన్ (అర్జున్ చిదంబరం). అతని దగ్గరే శంకర్ గూండాగా మారతాడు. శంకర్ అక్రమ మద్యం, ఆ తర్వాత వ్యభిచార గృహాల వ్యాపారంలో రాణించి, గ్యాంగ్ స్టర్ గా మారతాడు. ఆ తరువాత ఏం జరిగింది ? అన్నది స్టోరీ.

Also Read : కళ్లు చెదిరే విజువల్స్…శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే తొమ్మిది తోకల నక్క… ఆకట్టుకుంటున్న ఫాంటసీ సిరీస్

రియల్ స్టోరీ ఏంటంటే ?

Advertisement

ఇది నిజ జీవిత కథ. చెన్నైకి చెందిన గౌరీ శంకర్ అనే ఆటో డ్రైవర్‌ స్టోరీ. అతను 1980వ దశకంలోనే నేర ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చాడు. వ్యభిచార దందాను నడపడంతో పాటు, ఎన్నో హత్యలు కూడా చేశాడు. 1985 నుండి 1995 వరకు నగరంలో భయభ్రాంతులను సృష్టించి, ఏకంగా ఆరుగురిని చంపాడు. ఆ వ్యక్తిని 1988లో పోలీసులు అరెస్టు చేయగా, అనంతరం కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. 1995లో అతడిని ఉరి తీశారని సమాచారం. అలా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. మీకు కూడా ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ అంటే ఇష్టమైతే ఖచ్చితంగా ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×