Taliban On PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) మరో 8 రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీన ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. లాహోర్ ఖలందర్స్ vs హైదరాబాద్ కింగ్స్‌మెన్ ( lahore qalandars vs hyderabad kingsmen ) జట్ల మధ్య తొలి ఫైట్ లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన ప్రతి మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తాలిబన్స్ ( Talibans) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో భాగంగా జరిగే స్టేడియాల్లో బాంబులు వేస్తామని తాలిబన్స్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరుణంలో విదేశీ ప్లేయర్లు పాకిస్తాన్ కు రాకూడదని కూడా సూచనలు చేశారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్. దీంతో తాలిబన్స్ చేసిన వార్నింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు మార్చి 26వ తేదీన ప్రారంభం కానుంది. అయితే మార్చి 28వ తేదీన పెషావర్ జల్మీ వర్సెస్ రావల్పిండి మధ్య పెషావర్ వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. ఈ పెషావర్ స్టేడియం ఆఫ్గానిస్థాన్ బార్డర్ కు దగ్గరగానే ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రమాదంగా మారింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో ఉన్న స్టేడియాలపై దాడులు చేసేందుకు తాలిబన్లు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే మార్చి 28వ తేదీన పెషావర్ స్టేడియంపై బాంబులు వేస్తామని తాలిబాన్స్ వార్నింగ్ ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. దీంతో ఆ రోజున జరిగే పెషావర్ జల్మీ వర్సెస్ రావల్పిండి మ్యాచ్ వేదికను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లేదా ఆ మ్యాచ్ రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అటు ఈ వేదికగా జరిగే మ్యాచ్ లకు ఆస్ట్రేలియా ప్లేయర్లు దూరంగా ఉండాలని ఇప్పటికే వాళ్ల క్రికెట్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. ఇది ఇలా ఉండగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ప్రారంభమైన తర్వాత తాలిబన్లు అనుకున్నట్టుగా ఏదో ఒక స్టేడియంపై బాంబు వేస్తే మాత్రం చాలా మంది క్రికెట్ అభిమానులతో పాటు స్టార్ క్రికెటర్లు కూడా మరణించే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇటీవలే ఆఫ్ఘానిస్తాన్ లోని కాబూల్ ఆస్పత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ క్రమంలో 400 మంది అమాయక పౌరులు మృతి చెందారు. దీంతో పాకిస్తాన్ పై రివేంజ్ తీర్చుకునేందుకు తాలిబన్స్ సిద్ధం అవుతున్నారు.
🚨 PSL UNDER ATTACK – TALIBAN IN ACTION 🚨
Peshawar Zalmi vs Rawalpindi match in Peshawar will be moved due to Taliban's warning 😆
Taliban is active and planning to bomb the stadium, so foreign players are advised not to travel to Pakistan 😯pic.twitter.com/dF7unlwGrW
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 18, 2026