BigTV English

Rahul Vaidya: కోహ్లీ పెద్ద జోకర్…30% పెరిగిన ఫాలోవర్స్.. లక్ అంటే అవ్‌నీత్ కౌర్ దే

Rahul Vaidya: కోహ్లీ పెద్ద జోకర్…30% పెరిగిన ఫాలోవర్స్.. లక్ అంటే అవ్‌నీత్ కౌర్ దే

Rahul Vaidya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో… ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి అలాగే ఆయన అభిమానుల గురించి ప్రముఖ సింగర్ రాహుల్ వైద్య వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. విరాట్ కోహ్లీ పెద్ద జోకర్ అని, అతని ఫ్యాన్స్ కూడా… ఇంకా పెద్ద జోకర్లు అంటూ బాంబు పేల్చాడు బిగ్ బాస్ రన్నర్ ఆఫ్ రాహుల్ వైద్య. దీంతో విరాట్ కోహ్లీ పైన రాహుల్ వైద్య చేసిన పోస్టు వైరల్ గా మారింది.


అవ్‌నీత్ కౌర్ పెట్టిన పెంట

వాస్తవానికి విరాట్ కోహ్లీ వర్సెస్ రాహుల్ వైద్య మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఈ గొడవలన్నీ తీసుకువచ్చింది బాలీవుడ్ బ్యూటీ అవ్‌నీత్ కౌర్  మాత్రమే. ఆమె తాజాగా… కొన్ని హాట్ ఫోటోలను పంచుకుంది. అయితే ఆ హాట్ ఫోటోలను విరాట్ కోహ్లీ లైక్ కొట్టినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. చాలామంది ఫాలోవర్స్ ఉన్న విరాట్ కోహ్లీ… ఆ హార్ట్ బ్యూటీ అవ్‌నీత్ కౌర్ పోస్ట్ లైక్ కొట్టడంపై సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. దీంతో విరాట్ కోహ్లీ టీం దీన్ని ఖండించింది.


అదంతా తప్పుడు ప్రచారం అని.. కావాలనే కొంతమంది విరాట్ కోహ్లీ పైన బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది అతని టీం. అయితే అవ్‌నీత్ కౌర్ ఫోటోను లైక్ చేసినట్లు…. విరాట్ కోహ్లీ పోస్టర్ వైరల్ చేసింది అతని ఫ్యాన్స్ తెలుస్తోంది. దీంతో సింగర్ రాహుల్ వైద్య అరిచిపోయాడు. విరాట్ కోహ్లీ అలాగే ఆయన ఫ్యాన్స్ పెద్ద జోకర్లు అంటూ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఓ వీడియో పెట్టి విరాట్ కోహ్లీ పరువు తీసే ప్రయత్నం చేశాడు. నా సోషల్ మీడియా అకౌంట్ ను విరాట్ కోహ్లీ బ్లాక్ చేశాడని బాంబు పేల్చాడు. ఇది దారుణమని మండిపడ్డాడు. విరాట్ కోహ్లీ పెద్ద జోకర్ అని మరోసారి చురకలు అంటించాడు.

అయితే దీనిపై… చివరలో క్లారిటీ ఇస్తూ… విరాట్ కోహ్లీ తనను బ్లాక్ చేయలేదని మరోసారి వివరించాడు. అవ్‌నీత్ కౌర్  విషయంలో సోషల్ మీడియాలో రచ్చ జరిగిన తర్వాత… నెమ్మదిగా విరాట్ కోహ్లీ టీం స్పందించిందని… అందుకే తాను విరాట్ కోహ్లీ పరువు తీసే ప్రయత్నం చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు రాహుల్ వైద్య. అందుకే విరాట్ కోహ్లీ పెద్ద జోకర్ , అతడు నా అకౌంట్ బ్లాక్ చేశాడని చెప్పినట్లు వెల్లడించాడు. దీంతో విరాట్ కోహ్లీ పై రాహుల్ వైద్య పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే విరాట్ కోహ్లీ పై రాహుల్ వైద్య చేసిన పోస్ట్ పైన కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ఆఫ్ట్రాల్ సింగర్ వన్ టు ఫైర్ అవుతున్నారు.

ఒక్కసారిగా పెరిగిన అవనీత్ కౌర్ ఫాలోవర్స్

అవ్‌నీత్ కౌర్ ఫోటోను విరాట్ కోహ్లీ లైక్ కొట్టడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాదాపు 30% ఫాలోవర్స్ ఒక్క రోజులో పెరిగిపోయారు. రెండు మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది అవ్‌నీత్ కౌర్. ఆమె సోషల్ మీడియా పోస్ట్ వ్యాల్యూ కూడా పెరిగింది. గతంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రెండు లక్షలు తీసుకునే అవ్‌నీత్ కౌర్… ఇప్పుడు 2.6 లక్షలు తీసుకుంటుందని సమాచారం.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×