Today Gold Rate: పసిడి ప్రియులకు మరోసారి బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. గతవారం దిగొచ్చినట్టు కనిపించిన బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 2 వేల 500 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 2 వేల 730 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 90 వేల 250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 98 వేల 460 పలుకుతోంది. ఈ ఏడాది బంగారం ధరలు జెట్ స్పీడ్ తో పెరుగుతున్నాయి.
సంప్రదాయకంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు వ్యతిరేకంగా.. రక్షణ కవచంగా భావించే బంగారం ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 26 శాతం వరకు పెరిగింది. యూఎస్ సుంకాలు రేకెత్తించిన మాంద్యం భయాలతో.. గోల్డ్ రేట్లు అమాంతం పెరిగిపోయాయ్. కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం రేటు రికార్డు స్థాయిలో 3500 డాలర్లు తాకింది. ఇప్పుడు.. డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ లాంటి అంశాలు.. గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతున్నాయ్. దాంతో.. క్రమంగా ధరలు దిగొస్తున్నాయ్. ఇప్పడు ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర.. 96 నుంచి 98 వేల మధ్యలో ఉంది.
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులతో గోల్డ్ రేట్లు పెరిగిపోయాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో అశాంతి, అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలన్నీ.. బంగారం డిమాండ్‌ని పెంచాయ్. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలతో.. బంగారాన్ని ఇన్‌ఫ్లేషన్‌కు వ్యతిరేకంగా రక్షణగా భావించారు. మరోవైపు.. భారత్, చైనా లాంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వల్ని పెంచాయ్. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల.. దేశీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడం, దీనికి తోడు డాలర్ బలపడటంతో ఒక్కసారిగా గోల్డ్ రేట్లు దిగొస్తున్నాయ్. దేశీయ ఫ్యూచర్ మార్కెట్స్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. దీంతో పాటు వడ్డీ రేట్ల కోత విషయంలో ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్, ట్రంప్ మధ్య వివాదం నెలకొంది. ట్రంప్ టారిఫ్‌లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. దీంతో పసిడికి గిరాకీ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,250 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 460 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,250 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 460 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,250 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 460 చేరుకుంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,400ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 610 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,250 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 460 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,250 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 460 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: ప్రముఖ బట్టల సంస్థ వెబ్‌సైట్ పై సైబర్ దాడి..రూ.7500 కోట్ల నష్టం..
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,07,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.96,900 వద్ద కొనసాగుతోంది.