T20 World Cup 2026 Super 8: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇవాల్టి నుంచి సూపర్ 8 దశ ( T20 World Cup 2026 Super 8) ప్రారంభం కాబోతోంది. సెమీ ఫైనల్ కంటే ముందు ఈ సూపర్ 8 చాలా కీలకం. ఇందులో బాగా ఆడితేనే సెమీఫైనల్ అవకాశం దక్కుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సూపర్ 8 లో భాగంగా ఇవాళ మొట్ట మొదటి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరార్ అయింది. శ్రీలంకలోని కొలంబో ఆర్. ప్రేమ దాస స్టేడియంలో ( R.Premadasa Stadium, Colombo) పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand vs Pakistan)మధ్య ఈ సూపర్ 8 తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తొలి పోరు జరగనుంది. ప్రేమ దశ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్కు వర్షం విలన్ గా మారే ప్రమాదం పొంచి ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఉండనుంది. ఆ సమయంలో 70% వర్షం కొలంబోలో పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేస్తోంది. ఒకవేళ భారీ వర్షం పడితే మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ క్యాన్సిల్ అయితే… రిజర్వుడే మాత్రం ఉండదు. న్యూజిలాండ్ అలాగే పాకిస్తాన్ జట్లకు చెరో పాయింట్ లభించనుంది. కాగా ఈ సూపర్ 8 మ్యాచ్ లన్ని కూడా జియో హాట్ స్టార్ లో వస్తాయి. స్టార్ స్పోర్ట్స్ లో కూడా చూడవచ్చు.
ఇది ఇలా ఉండగా ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో భాగంగా టీమిండియా మ్యాచ్ లు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. టీమిండియా తన తొలి సూపర్ 8 మ్యాచ్ దక్షిణాఫ్రికా తో ఆడనున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య తొలి మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ అనంతరం జింబాబ్వే తో ఫిబ్రవరి 26వ తేదీన మరో మ్యాచ్ ఆడనుంది టీమిండియా జట్టు. అలాగే మార్చి ఒకటో తేదీన వెస్టిండీస్తో చివరి సూపర్ 8 మ్యాచ్ ఉంటుంది.
Pakistan Probable XI: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (c), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (wk), ఖవాజా నఫే, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
New Zealand Probable XI: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (wk), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (c), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, ఇష్ సోధి
🚨 PAKISTAN v NEW ZEALAND – WEATHER UPDATE 🚨
– There is a 70% chance of rain during the Pakistan vs New Zealand Super 8 game.
– Rain could spoil the game between Pakistan and New Zealand, and unfortunately, we might see a washout as well. (BBC Weather) pic.twitter.com/BOWZuMwqQZ
— Rayham (@RayhamUnplugged) February 20, 2026