Albie vs Morne Morkel: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) సూపర్ 8 దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సూపర్ 8 దశలో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa ) మధ్య మొట్ట మొదటి మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదిక ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. అయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ రెండు జట్ల కారణంగా తల్లి గుండె కోత అందరిని కలిచి వేస్తోంది. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ( Morne Morkel), దక్షిణాఫ్రికా స్పెషల్ కోచ్ అల్బీ మోర్కెల్ ( Albie Morkel) తల్లి బాధ ఎవరికి రాకూడదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా సూపర్ 8 దశలో ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఫైట్ జరగనుంది. ఇందులో గెలిస్తేనే టోర్నమెంట్ లో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకము. ఇలాంటి నేపథ్యంలో దక్షిణాఫ్రికా స్పెషల్ కోచ్ అల్బీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానేమో దక్షిణాఫ్రికా జట్టుకు పనిచేస్తున్నాను.. తన సోదరుడు మోర్నీ మోర్కెల్ ఇండియాకు వర్క్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తన తల్లి ఆందోళన చెందుతోందని స్పష్టం చేశారు. అన్నదమ్ములమిద్దరం తలో దారిన ఉన్నాం.. ఇప్పుడు ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఫైట్ జరగబోతుందని వెల్లడించారు.
ఇలాంటి నేపథ్యంలో తన తల్లి ఎవరికి సపోర్ట్ చేయాలి ? ఏ జట్టు గెలవాలని కోరుకోవాలి ? ఈ ప్రశ్న తన తల్లిని వేధిస్తోందని ఎమోషనల్ అయ్యారు అల్బీ మోర్కెల్. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని వెల్లడించారు. దీంతో అల్బీ మోర్కెల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా దాదాపు మూడు సంవత్సరాల నుంచి టీమిండియా కు మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్ గా పని చేస్తున్నారు. ఇటు అల్బీ మోర్కెల్ దక్షిణాఫ్రికాకు ఇటీవల ఎంపికయ్యారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో స్పెషలిస్ట్ కోచ్ గా అల్బీ మోర్కెల్ ఎంపికయ్యారు. ఇక సూపర్ 8 దశలో ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఫైట్ జరగనున్న నేపథ్యంలో… అన్నదమ్ముల మధ్య వార్ మొదలైంది. మ్యాచ్ పరంగా ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ పర్సనల్ గా మాత్రం మోర్కెల్ బ్రదర్స్ మధ్య మంచి బాండింగ్ ఉంది.
ఫిబ్రవరి 22వ తేదీన ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా ఫిబ్రవరి 26వ తేదీన జింబాబ్వేతో ఇండియా ఫైట్ ఉంటుంది. మార్చి ఒకటో తేదీన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరుగనుంది.