Gautam Gambhir-RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals) కొత్త యజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. గౌతమ్ గంభీర్ కు ( Gautam Gambhir ) మూడు బంపర్ ఆఫర్లు ఇచ్చిందట రాజస్థాన్ రాయల్స్ కొత్త యజమాన్యం. తన భాగస్వామిగా, మెంటార్, CEO పదవి గౌతమ్ గంభీర్ కు ఇచ్చేందుకు సిద్ధం అయిందట రాజస్థాన్ రాయల్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఈ ఆఫర్ గంభీర్ కు ఇచ్చిందట. అయితే, దీనిపై ఇంకా గౌతమ్ గంభీర్ రియాక్ట్ కాలేదని సమాచారం అందుతోంది. కానీ ఈ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ తంతే పరుపులో పడ్డాడని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: IND VS PAK: ఇక పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెలవడం చేతకాక, చివరకు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే 31వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టును కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు రంగంలోకి దిగబోతున్నాయట. అందులో ఓ ఫ్రాంచైజీ, భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ జట్టును కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ కొత్త ఫ్రాంచైజీ, రాజస్థాన్ రాయల్స్ జట్టును కొనుగోలు చేయడమే కాకుండా, గౌతమ్ గంభీర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిందట. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ తన పదవికి రాజీనామా చేసి, తమతో పని చేయాలని సదరు ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ మెంటార్, సీఈవో, జట్టు భాగస్వామిగా అవకాశం ఇవ్వబోతున్నారట. రాజస్థాన్ రాయల్స్ లో దాదాపు మూడు శాతం వాటాలను గంభీర్ కు ఇచ్చేందుకు సిద్ధమైందట ఆ కొత్త ఫ్రాంచైజీ.
రాజస్థాన్ రాయల్స్ కొత్త ఫ్రాంచైజీ ఈ ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ రాజీనామా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు టీం ఇండియాకు సేవలు అందిస్తానని అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు గౌతమ్ గంభీర్. ఇలాంటి నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కొత్త ఫ్రాంచైజీ, ఇచ్చిన ఆఫర్ ను గౌతమ్ గంభీర్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా గౌతమ్ గంభీర్ తన సారథ్యంలో మొత్తం మూడు ఐపిఎల్ ట్రోఫలను కేకేఆర్ కు అందించాడు. కేకేఆర్ సారధిగా, మెంటార్ ఈ సేవలు అందించిన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గా ఆఫర్ ఇచ్చింది బీసీసీఐ.
🚨RR NEW OWNERS WANTS GAMBHIR 🚨
RR is set to get new owners soon. The new RR management wants Gautam Gambhir to join them as a partner, mentor, and CEO. Regarding this, one of RR’s three new owners has already sent a proposal to Gambhir
— Abhishek Tripathi 📰 pic.twitter.com/sypQAhbbv0
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) February 17, 2026