E-Paper
Advertisement

IND VS PAK: ఇక‌ పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెల‌వ‌డం చేత‌కాక‌, చివ‌ర‌కు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర‌

IND VS PAK: ఇక‌ పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెల‌వ‌డం చేత‌కాక‌, చివ‌ర‌కు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర‌
Advertisement

IND VS PAK: పాకిస్తాన్ జట్టు రోజు రోజుకు దిగజారుతోంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పురుషుల పాకిస్తాన్ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైతే… మహిళా క్రికెటర్లు కూడా అలాగే తయారయ్యారు. ప్రస్తుతం మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్ 2026 టోర్నమెంట్ ( ACC Women’s Asia Cup Rising Stars 2026) జరుగుతోంది. అయితే ఈ టోర్నమెంటులో ఇండియాను ఓడించేందుకు పాకిస్తాన్ కొత్త కుట్రకు తెర లేపింది. కానీ ఈ కుట్ర బట్టబయలైంది. టీమిండియా ఏ మహిళల జ‌ట్టుకు సంబంధించిన వృందా దినేష్ ( Vrinda Dinesh) ను హిట్ వికెట్ చేసేందుకు పాకిస్తాన్ వికెట్ కీపర్ యుస్రా అమీర్ ( Yusra Amir) ప్లాన్ వేసింది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు కూడా వచ్చింది. దీంతో పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా పోయింది.

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

పాకిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో విజ‌యం

Advertisement

మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన టీమిండియా మహిళల ఏ వర్సెస్ పాకిస్తాన్ మహిళల ఏ ( India A Women vs Pakistan A Women) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా మహిళల జట్టు, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శివరాత్రి రోజున మహిళల పాకిస్తాన్ జట్టుకు కూడా మన మహిళా క్రికెటర్లు నరకం చూపించారు.

ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 18.5 ఓవర్లు ఆడింది పాకిస్తాన్ మహిళల జట్టు. అయితే పాకిస్తాన్ జట్టులో ఎవరు పెద్దగా రాణించకపోవడంతో 93 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. ఇక ఈ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఊదేసింది టీమిండియా మహిళలు జట్టు. కేవలం రెండు వికెట్లు నష్టపోయి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ లో వృందా దినేష్ ( Vrinda Dinesh) 55 పరుగులతో రాణించగా అనుష్క శర్మ 24 పరుగులతో రెచ్చిపోయింది.

తెర‌పైకి హిట్ వికెట్ వివాదం

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో హిట్ వికెట్ తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్ లో 55 పరుగులతో అద్భుతంగా రాణించిన వృందా దినేష్ ( Vrinda Dinesh) ను అవుట్ చేసేందుకు పాకిస్తాన్ వికెట్ కీపర్ యుస్రా అమీర్ ( Yusra Amir) కుట్రకు తినలేరు. వృందా దినేష్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా ఓ బంతి మెల్లగా వికెట్లను తగిలే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో అలర్ట్ అయిన వృందా దినేష్, ఆ బంతిని బ్యాట్ తో ఆపే ప్రయత్నం చేసింది. కానీ అంతలోనే అక్కడికి చేరుకున్న వికెట్ కీపర్ యుస్రా అమీర్, ఆ బంతి వికెట్లకు తాకినట్లుగా చూపించే ప్రయత్నం చేసింది. బంతిని మెల్లగా వికెట్ల వైపు నెట్టేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఆ సమయంలో ఫీల్డ్ అంపైర్ ఈ విష‌యాన్ని గ్రహించి నాటౌట్ గా ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆ వీడియో బయటకు రావడంతో పాకిస్తాన్ పరువు తీస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. తొండాట ఆడి గెలిచేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేసిందని.. ఈ విషయంలో పురుషులైన పాకిస్తాన్ మహిళలైనా ఒకటేనని తేలిపోయిందని దారుణంగా కామెంట్లు పెడుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్.

 

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×