Big Stories

Ind vs Eng 5th Test: ఐదో టెస్టుకు రజత్ పటీదార్ అవుట్ ? రాహుల్ వస్తాడా? దేవదత్ ఆరంగేట్రం చేస్తాడా?

 

- Advertisement -
India vs England 5th Test squad
 

India vs England 5th Test squad: ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఆఖరిది ధర్మశాల వేదికగా మార్చి 7న ప్రారంభం కానుంది. ఆల్రడీ 3-1తో సిరీస్ ను టీమ్ ఇండియా గెలిచింది కాబట్టి, ఐదో టెస్టులో ప్రయోగాలు చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -

కొత్తగా ఆరంగేట్రం చేసిన రజత్ పటీదార్ ను దాదాపు పక్కన పెట్టినట్టు అంతా అనుకుంటున్నారు. వరుసగా మూడు టెస్టుల్లో అవకాశం కల్పించినా తను పెద్దగా ప్రభావం చూపించలేక పోయాడు. ఆరు ఇన్నింగ్స్ లో కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు రెండు సార్లు డ‌కౌట్ అయ్యాడు.అత‌డి అత్య‌ధిక స్కోరు 32 ప‌రుగులు మాత్ర‌మే. దీంతో వేటు తప్పేలా లేదు.

అలా జరిగితే అతని ప్లేస్ లో వస్తే కేఎల్ రాహుల్ రావచ్చు. అతని గాయం పెద్దదైతే మాత్రం దేవదత్ పడిక్కల్ తొలి ఆరంగేట్రం మ్యాచ్ ఆడే అవకాశం వస్తుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో సీనియర్ల గైర్హాజరీలో  కొత్త ఆటగాళ్లు నలుగురు రంగ ప్రవేశం చేశారు. రజత్ పటీదార్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్ ఉన్నారు. దేవదత్ కూడా వస్తే ఐదోవాడు అవుతాడు. 99 శాతం తనకే అవకాశం దక్కవచ్చునని అంతా అంటున్నారు.

read more: రంజీల్లో ఆడనంత మాత్రాన తీసేస్తారా?

మరోవైపు  కేఎల్ రాహుల్‌, బుమ్రా రీఎంట్రీ ఇస్తున్నారని కూడా  అంటున్నారు. బుమ్రా వస్తే తొలిటెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆకాశ్ దీప్ ను తప్పిస్తారా? లేక కష్టకాలంలో ఆదుకుంటున్న సిరాజ్ ని తప్పిస్తారా? అనేది నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలాగని ముగ్గురు పేసర్లతో దిగే సాహసాన్ని టీమ్ ఇండియా చేయలేకపోవచ్చు. ఇదిప్పుడు టీమ్ ఇండియాకి కత్తిమీద సామే అని చెప్పాలి.

నిజానికి సీనియర్లు కొహ్లీ, రాహుల్, గైర్హాజరీలో ఇద్దరు బ్యాటర్లు వచ్చారు. వారిలో రజత్ పటీదార్ విఫలమైతే, సర్ఫరాజ్ ఆకట్టుకున్నాడు. వికెట్ కీపింగ్ లో కేఎస్ భరత్ విఫలమైతే, ధ్రువ్ జురెల్ ఆకట్టుకోవడమే కాదు,

నాలుగో టెస్ట్ ను ఓటమి కోరల నుంచి కాపాడి, గెలిపించాడు. ఇంక ఆకాశదీప్ కూడా ఆరంగేట్రం లోనే అదరగొట్టాడు. ఇప్పుడికి దేవదత్ పడిక్కల్ వంతు ఉంది. మరి తను ఆకట్టుకుంటాడా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News