Big Stories

BCCI central contract: రంజీల్లో ఆడనంత మాత్రాన తీసేస్తారా?

 

Ravi Shastri on BCCI Central ContractRavi Shastri on BCCI Central Contract: భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన 2023-24 వార్షిక కాంట్రాక్ట్‌లపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తున్నారు. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లకు కాంట్రాక్టు నుంచి తొలగించడం కరెక్టు కాదని అంటున్నారు. కేవలం రంజీల్లో ఆడనంత మాత్రాన తీసేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

టెస్ట్ మ్యాచ్ లు, రంజీలు అన్నీ రెడ్ బాల్ క్రికెట్, ఐపీఎల్ మ్యాచ్ లు, టీ 20లు అన్నీ వైట్ బాల్ క్రికెట్…ఇక్కడ, అక్కడా, ఆ బాల్,  ఈ బాల్ తో ఆడలేక యువ క్రికెటర్లు అవస్థలు పడుతున్నారు. అందుకే ఏదొక దానిపై ద్రష్టి పెట్టాలని వారు భావించి టెస్ట్ మ్యాచ్ ల నుంచి వైదొలిగినట్టు అంతా అనుకుంటున్నారు.

- Advertisement -

ఈ విషయంపై సీనియర్ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించాడు. వాళ్లిద్దరూ రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తారని, ఇందులో కంగారు పడాల్సిన పనేమీ లేదని అన్నాడు. క్రికెట్ లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ సర్వసాధారణమని అన్నాడు. అయితే ఎంతో కష్టపడి, కొన్ని వేల మందిని దాటుకుని వారు జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. మళ్లీ వాళ్లు జట్టులోకి వస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Read more: ఇషాన్, శ్రేయాస్ తొలగింపు వెనుక కుట్ర? సోషల్ మీడియాలో వైరల్

మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాంట్రాక్ట్‌లు కేటాయించే విషయంలో బీసీసీఐ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించాడు. అసలు ఏ ప్రాతిపదికన కాంట్రాక్టులు కేటాయించారని ప్రశ్నించాడు. హార్దిక్ పాండ్యా కూడా రెడ్ బాల్ క్రికెట్ ఆడటం లేదని అన్నాడు. కానీ తనకి ఏ గ్రేడ్ కేటాయించారని, ఇదెక్కడి రూల్ అని అన్నాడు. రిషబ్ పంత్ ప్రతిభావంతుడైన ఆటగాడే, కానీ తనని కొనసాగిస్తున్నారు.

బీసీసీఐ మూడు జట్లుగా విభజించినప్పుడు రెడ్ బాల్ క్రికెట్ ఆడలేమని చెప్పే క్రికెటర్లను టీ 20లకే పరిమితం చేయాలని అంటున్నారు. ఎందుకు వారిని టెస్ట్ మ్యాచ్ లు ఆడండి, రంజీలు ఆడండి బలవంతం చేస్తున్నారు?  వారి భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News