Big Stories

Unmukt Chand: దేశవాళీ క్రికెట్ పై టర్న్ అయిన.. ఉన్ముక్త్ చంద్ మాటలు

 

- Advertisement -
Former Under-19 captain Unmakt Chand
 

Under 19 world cup winning captain harrowing take: బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ మండిపడుతుంటే, అది సరైనదేనని, అదే కరెక్ట్ అని అండర్ 19 మాజీ కెప్టెన్ ఉన్మక్త్ చంద్ పేర్కొన్నాడు. తనే ఉద్దేశంతో అన్నాడో తెలీదు కానీ, తను మాట్లాడిన సమయానికి ఇక్కడ ఇద్దరు క్రికెటర్లు శ్రేయాస్, ఇషాన్ కిషన్ పై బీసీసీఐ వేటు వేసింది.

- Advertisement -

మరి ఉన్మక్త్ వీరిద్దరినీ ఉద్దేశించి అన్నాడా? అంటే అదేం కాదని కొందరు వ్యాక్యానిస్తున్నారు.  ఇంతకీ తను 2012 అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల ఉన్మక్త్ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోలేక యూఎస్ ఏ వెళ్లాడు. అక్కడ అమెరికా జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో టీ 20 లీగ్ క్రికెట్ పై ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.

విదేశీ లీగ్ లు ఆడేందుకు భారత ఆటగాళ్లకు బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదని, అది మంచి నిర్ణయమని అన్నాడు. దీనివల్ల దేశీయ క్రికెట్ బతుకుతుందని అన్నాడు. ఇప్పటికే రంజీలు ఆడేందుకు ఇష్టపడని క్రికెటర్లు విదేశీ లీగ్ లు ఆడేందుకు మక్కువ చూపిస్తున్నారని, వారికి ఆదాయానికి ఆదాయం, టైమ్ కి టైమ్ కలిసి వస్తుందని తెలిపాడు.

Read more: రంజీల్లో ఆడనంత మాత్రాన తీసేస్తారా?

ఇండియాలో రంజీ ట్రోఫీ, ఐపీఎల్, విజయ్ హజారే ఇలా ఎన్నో టోర్నమెంట్లు జరుగుతుంటాయి. జాతీయ జట్టులో ఆడే క్రీడాకారులను వదిలితే, ఇవన్నీ కూడా కళావిహీనంగా మారతాయని తెలిపాడు. అందుకనే జాతీయ జట్టులో ఆడని క్రీడాకారులు ఇక్కడ ఆడితే బాగుంటుందని తెలిపాడు.

అయితే వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, ప్రతి క్రికెటర్ ఎక్కడికైనా వెళ్లి ఆడితే బాగుంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అయితే ప్రపంచంలోని అన్ని లీగ్ మ్యాచ్ లు ఆడతాడు, జాతీయ జట్టులో స్థానం సంపాదించుకుంటాడని తెలిపాడు.

అమెరికాలో జరగనున్న టీ 20 ప్రపంచకప్ లో ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ పై అందరిలా తనకి ఆసక్తిగా ఉందని తెలిపాడు. అయితే యూఎస్ఏ జట్టులో తను కూడా సభ్యుడే కాబట్టి, ఇండియా-యూఎస్ఏ మ్యాచ్ లో తను ప్రత్యర్థి జట్టు నుంచి ఆడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే జీవితమంటే అని తెలిపాడు.మనం అనుకున్నదేదీ జరగదు, జరిగేది మనకు తెలీదని వేదాంత ధోరణిలో చెప్పాడు.

మొత్తానికి ఒకనాటి అండర్ 19 కెప్టెన్ దేశవాళీ క్రికెట్ పై మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి. తను చెప్పే టైమ్ కి శ్రేయాస్, ఇషాన్ ఇద్దరిని తప్పించడం, తను విదేశీ లీగ్ లపై చెప్పింది…పిచ్ పై మరో టర్న్ తీసుకుని వివాదాస్పదమైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News