E-Paper
Advertisement

Rashid Khan Bullet Proof Car : పాకిస్తానోడు ఏ క్ష‌ణ‌మైనా బాంబ్ లేస్తాడు..అందుకే ఆ కారులోనే అఫ్ఘ‌నిస్తాన్ లో తిరుగుతా!

Rashid Khan Bullet Proof Car : పాకిస్తానోడు ఏ క్ష‌ణ‌మైనా బాంబ్ లేస్తాడు..అందుకే ఆ కారులోనే అఫ్ఘ‌నిస్తాన్ లో తిరుగుతా!
Advertisement

Rashid Khan Bullet Proof Car :  సాధార‌ణంగా ఈ మ‌ధ్య కాలంలో క్రికెట‌ర్ల జీవితాల్లో ర‌క‌ర‌కాల సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. మ‌నం నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా అప్గానిస్తాన్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్ కూడా త‌న జీవితంలో జ‌రిగిన ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించాడు. వాటిలో ముఖ్యంగా అప్గానిస్తాన్ లో త‌న‌కు బుల్లెట్ ప్రూఫ్ కారు ఉందని తెలిపారు స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్. ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ పీట‌ర్స‌న్ చేసిన ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కాబుల్ వీధుల్లో న‌డుచుకుని వెళ్తారా..? అని పీట‌ర్స‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు ర‌షీద్ ఖాన్ ఇలా స‌మాధానం చెప్పాడు.

Also Read : Team India Salaries: టీమిండియా క్రికెట‌ర్ల జీతాలు భారీగా పెంపు..ఒక్కో మ్యాచ్ కు ఎంతంటే

“అప్గానిస్తాన్ వీధుల్లో నేను న‌డుచుకుంటూ తిర‌గ‌లేను”

Advertisement

“అప్గానిస్తాన్ వీధుల్లో నేను న‌డుచుకుంటూ తిర‌గ‌లేను. మామూలు కారులో కూడా వెళ్ల‌లేను. అందుకే నా బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్తాను. అది నా సేప్టీ కోస‌మే” అని ర‌షీద్ ఖాన్ చెప్పారు. దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం పీట‌ర్స‌న్ వంతు కావ‌డం విశేషం. ముఖ్యంగా ఈ ఇంట‌ర్వ్యూ ప్రారంభంలో పీట‌ర్స‌న్ అడిగిన ప్ర‌శ్న నే అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు కాబూల్ లో బుల్లెట్ ప్రూఫ్ కారు ఎందుకు..? అని పీట‌ర్న‌ర్ ప్ర‌శ్నించాడు. అయితే త‌న భ‌ద్రత కోస‌మే. రాంగ్ ప్లేస్, రాంగ్ టైమ్ ఉండ‌కూడ‌దు. అప్గానిస్తాన్ లో ఇది చాలా సాధార‌ణం అని అంద‌రికీ ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయ‌ని చెప్పుకొచ్చాడు ర‌షీద్ ఖాన్. ముఖ్యంగా పాకిస్తాన్- అప్గానిస్తాన్ మ‌ధ్య నిత్యం గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల బ్లాస్టింగ్ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలోనే ర‌షీద్ ఖాన్ ఇలాంటి కామెంట్స్ చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టిన అప్గాన్ క్రికెటర్ ర‌షీద్ ఖాన్

ర‌షీద్ ఖాన్ మాట‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించిన విష‌యం ఒక్క‌టే.. అత‌నికీ ప్రాణ ర‌క్ష అవ‌స‌రం అని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. రాజ‌కీయ అస్థిర‌త, భ‌ద్ర‌త స‌మ‌స్య‌లు కొన‌సాగుతున్న దేశంలో జీవించ‌డం అత‌డినీ ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉంచుతోంది. సంభాష‌ణ‌లో అత్యంత గ‌మ‌నార్హ‌మైన అంశం ఇలాంటి భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను ర‌షీద్ చాలా సాధార‌ణంగా తీసుకున్నారు. ఐపీఎల్, బీబీఎల్ వంటి లీగ్ ల్లో ఆడుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ర‌షీద్ ఖాన్, అప్గానిస్తాన్ లో అత్యంత ప్ర‌సిద్ధ వ్య‌క్తుల్లో ఒకడు. అదే అత‌డినీ భ‌ద్ర‌త ప‌రంగా హై రిస్క్ టార్గెట్ గా మారుస్తోంది. అత‌ని సంపాద‌న‌, పేరు ప్ర‌తిష్ట‌లు అత‌నికి అద‌న‌పు భ‌ద్రత అవ‌స‌రం చేస్తున్నాయి. త‌న దేశానికీ ప్రాతినిధ్యం వ‌హించ‌డం అత‌నికీ ఇప్ప‌టికీ అత్యంత గౌర‌వంగా భావిస్తున్న విష‌యం అని చెప్ప‌వ‌చ్చు. ఈ విష‌యంలో పీట‌ర్స‌న్ ఆశ్చ‌ర్య‌పోయినా.. ర‌షీద్ మాత్రం ప్ర‌శాంతంగా స్పందించాడు. ఇది అప్గానిస్తాన్- పాకిస్తాన్ గొడ‌వ‌ల‌కు సంబంధించి జీవ‌న వాస్త‌వాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెబుతోంది.

Advertisement

Also Read : Gambhir-Kohli: కోహ్లీపై గంభీర్ మ‌రో కుట్ర‌..వ‌న్డేలు కూడా ఆడ‌కుండా బీసీసీఐకి ఫిర్యాదు ?

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×