E-Paper
Advertisement

Avinash Mohanty: సైబర్ నేరాలు తగ్గాయి.. భూ వివాదాల్లో రాజకీయ ఒత్తిళ్లు లేవు: సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి

Avinash Mohanty: సైబర్ నేరాలు తగ్గాయి.. భూ వివాదాల్లో రాజకీయ ఒత్తిళ్లు లేవు: సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి
Advertisement

Avinash Mohanty: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రజల్లో పెరిగిన అవగాహనే ఇందుకు ప్రధాన కారణమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ఆయన 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఓవరాల్ క్రైమ్ రేట్‌లో పెద్దగా మార్పు లేదని, మొత్తం 37,243 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అయితే సైబర్ క్రైమ్ మాత్రం 35 నుండి 40 శాతం తగ్గిందని, బాధితులు కోల్పోయిన డబ్బు (Money Loss) రూ.793 కోట్ల నుంచి రూ.440 కోట్లకు తగ్గిందని వివరించారు. ముఖ్యంగా 117 డిజిటల్ అరెస్ట్ కేసుల్లో బాధితులకు రూ.96.76 లక్షలు తిరిగి ఇప్పించగలిగామన్నారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం – ట్రాఫిక్‌పై స్పెషల్ ఫోకస్:

మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఈ ఏడాది 575 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి, 1,228 మందిని అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. నిందితుల నుంచి రూ.16.85 కోట్ల విలువైన 1,524 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయని (15,706 కేసులు), రూ.239 కోట్ల విలువైన చలాన్లు విధించామని చెప్పారు. బ్లాక్ స్పాట్లపై దృష్టి సారించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, ఈ ఏడాది ప్రమాదాల్లో 850 మంది మరణించారని పేర్కొన్నారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ‘సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్’ విధానాన్ని, ట్రాఫిక్ మార్షల్స్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.

షీ టీమ్స్ & ఆపరేషన్ ముస్కాన్:

Advertisement

మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ముమ్మరంగా పనిచేశాయని, 3,315 మందిని డెకాయ్ ఆపరేషన్లలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని సీపీ తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2,298 మంది పిల్లలను రెస్క్యూ చేశామన్నారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు.

భూ వివాదాల్లో రాజకీయ జోక్యం లేదు:

మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానమిస్తూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడి ల్యాండ్ వివాదం కేసులో, గాచ్చిబౌలి సీఐ బదిలీలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. సీఐపై ఆరోపణలు వచ్చినందున, 10 రోజుల తర్వాత చర్యలు తీసుకున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలో భూముల విలువ ఎక్కువ కాబట్టి లిటిగేషన్లు, సివిల్ వివాదాలు సహజమని, శాంతిభద్రతల సమస్య తలెత్తితే తప్ప పోలీసులు 99 శాతం సివిల్ మ్యాటర్లలో జోక్యం చేసుకోరని అవినాష్ మహంతి స్పష్టం చేశారు.

Advertisement

Read Also: Vemulawada Temple: వేములవాడ భీమేశ్వరాలయంలో ఉద్రిక్తత.. కారణం ఇదే..!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×