E-Paper
Advertisement

Rashid latif: బాబ‌ర్ ఆజం చెత్త ప్లేయ‌ర్.. PSLలో ఆట చూసి, పాకిస్తాన్ జ‌ట్టులోకి తీసుకోవ‌ద్దు

Rashid latif: బాబ‌ర్ ఆజం చెత్త ప్లేయ‌ర్.. PSLలో ఆట చూసి, పాకిస్తాన్ జ‌ట్టులోకి తీసుకోవ‌ద్దు
Advertisement

Rashid latif:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Pakistan Super League 2026 Tournament) విజేతగా బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్ గా వ్యవహరించిన పెషావర్ జల్మీ జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ మధ్య జరిగింది. ఇందులో పెషావర్ జల్మీ అద్భుతమైన విజయం సాధించి… రెండోసారి టైటిల్ గెలుచుకుంది. దీంతో బాబర్ ఆజం పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. వెంటనే పాకిస్తాన్ జట్టులోకి అతనిని తీసుకొని కెప్టెన్ చేయాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. బాబర్ ఆజం మంచి ఫామ్ లో ఉన్నాడని.. ఇలాంటి క్రమంలో అతన్ని వాడుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాబర్ ఆజం పైన రషీద్ లతీఫ్ హాట్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ జట్టులోకి బాబర్ ఆజంను తీసుకోకూడదని అందరికీ షాక్ ఇచ్చారు రషీద్ లతీఫ్ ( Rashid Latif ). దీంతో రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

బాబర్ ఆజంను పాకిస్తాన్ జట్టులోకి తీసుకోవద్దు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Pakistan Super League 2026 Tournament) గెలిచిన కెప్టెన్ బాబర్ ఆజంను (Babar Azam) పాకిస్తాన్ జట్టులోకి తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే అతన్ని పాకిస్తాన్ టి20 జట్టులోకి తీసుకోకూడదని రషీద్ లతీఫ్ ( Rashid Latif ) వెల్లడించారు. టి20 లకు బాబర్ ఆజం అస్సలు పనికిరాదని.. వాడో చెత్త ప్లేయర్ అంటూ మండిపడ్డారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో బాబర్ రాణించినప్పటికీ.. అతని స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని వెల్లడించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో డక్ అవుట్ కావడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి ప్లేయర్ టీ20 లకు పనికిరాడు అని.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో ప్రదర్శన చూసి.. బాబర్ ఆజంను జట్టులోకి అస్సలు తీసుకోకూడదని కోరారు. అసలు టి20 లకు బాబర్ ఆజం పనికిరాబోడని కుండ బద్దలు కొట్టి చెప్పారు. దీంతో బాబ‌ర్ ఆజం పై ర‌షీద్ ల‌తీఫ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

బాబ‌ర్ ఆజంను కెప్టెన్ చేయాల్సిందే అంటూ డిమాండ్లు

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ట్రోఫీని దక్కించుకున్న బాబర్ ఆజంను ( Babar Azam) పాకిస్తాన్ టి20 జట్టులోకి తీసుకోవాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. షోయబ్ అక్తర్, తన్వీర్ అహ్మద్, ఇంజమాం లాంటి మాజీ క్రికెటర్లు… బాబర్ ఆజంను కెప్టెన్ చేయాలని కూడా అంటున్నారు. వెంట‌నే పాకిస్తాన్ జ‌ట్టుకు కెప్టెన్ చేయాల‌ని, 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం జ‌ట్టును సిద్ధం చేయాల‌ని కోరుతున్నారు.

Advertisement

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×