E-Paper
Advertisement

Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు

Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు
Advertisement

Digvesh Vs Bishnoi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రాసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants vs Rajasthan Royals) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సంబంధించిన హిమ్మత్ సింగ్ ( Himmat Singh) వికెట్ తీసిన తర్వాత సిగ్నేచర్ సెలబ్రేషన్ ( signature celebration) చేసుకున్నాడు రవి బిష్ణోయ్ ( Ravi Bishnoi). దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. లక్నో బౌలర్ దిగ్వేష్ ను ( Digvesh Rathi) ట్రోలింగ్ చేసేందుకుగాను రవి బిష్ణోయ్ ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ ర్యాగింగ్ దెబ్బకు మళ్ళీ దిగ్వేష్‌ గాడు ఓవరాక్షన్ చేయబోడని కౌంటర్లు పేల్చుత‌న్నారు. వాడికి సరైన‌ ట్రీట్మెంట్ ఇచ్చాడని ర‌విని మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్.

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

Advertisement

40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య లక్నో వేదికగా 32వ మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆరు వికెట్లు నష్టపోయిన రాజస్థాన్ రాయల్స్ 159 పరుగులు సాధించింది. రవీంద్ర జడేజా చివరి వరకు పోరాడి ఆ మాత్రం స్కోర్ రాబట్టగలిగాడు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ చెత్త ప్రదర్శన కనబరిచింది. 18 ఓవర్లు ఆడి 119 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ అందుకుంది.

దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్

Advertisement

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నిన్న మ్యాచ్ జరగగా.. రవి బిష్ణోయ్ ( Ravi Bishnoi) ఈ చేసిన సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. వాస్తవంగా రవి బిష్ణోయ్ చాలా కూల్ గా ఉంటాడు. ఎవరి జోలికి వెళ్లడు. వికెట్ తీసినా కూడా కాస్త కూల్ గానే సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. అలాంటి రవి బిష్ణోయ్ కి కోపం వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ హిమ్మత్ సింగ్ వికెట్ తీసిన అనంతరం సిగ్నేచర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు రవి బిష్ణోయ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన క్రికెట్ అభిమానులు రవి బిష్ణోయ్ ని మెచ్చుకుంటున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జ‌ట్టును ఓడించడమే కాదు… అందులో ఉన్న దిగ్వేష్ ర‌తి పరువు కూడా తీశాడని కామెంట్స్ చేస్తున్నారు. సిగ్నేచర్ సెలబ్రేషన్స్ పేరుతో దిగ్వేష్ అరాచకం సృష్టిస్తుంటే.. అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ రవి బిష్ణోయ్ బిహేవ్ చేశాడని మెచ్చుకుంటున్నారు.

 

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

 

?igsh=MTNoa2d5OXJmNmtoMQ==

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×