E-Paper
Advertisement

గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే
Advertisement

Rohit Sharma:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ( Mumbai indians) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) గాయం బారిన పడ్డ సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ( RCB) జరిగిన మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ ఔట్ అయ్యాడు రోహిత్ శ‌ర్మ‌. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న రోహిత్ శర్మ, త్వరలోనే రీ – ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ పుషప్స్ (Push-ups) సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2025 ఐపీఎల్ సందర్భంగా పుషప్స్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డ రోహితో శర్మ, ఇప్పుడు మాత్రం అవలీలగా పుషప్ సాధిస్తున్నాడు. గంటకు 100 Push-ups చొప్పున కొట్టమని టార్గెట్ ఇచ్చినా… ఏ మాత్రం రోహిత్ శర్మ తగ్గేలా కనిపించడం లేదు. అంతలా ఫిట్ నెస్ సంపాదించాడు రోహిత్ శ‌ర్మ‌.

Also Read: Javed Miandad: ఫర్హాన్ దెబ్బ‌కు బుమ్రా కెరీర్ నాశ‌నం..పాకిస్తాన్ తో పెట్టుకుంటే తొక్కిప‌డేస్తాం Javed Miandad

గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు

Advertisement

2025 ఐపీఎల్ వరకు బొద్దుగా… కనిపించిన రోహిత్ శర్మ, 2027 వన్డే వరల్డ్ కప్ కోసం మొత్తం మారిపోయాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో తుది జట్టులో స్థానం దక్కించుకోవాలన్న కసితో ముందుకు వెళుతున్నాడు. ఇందులో భాగంగానే దాదాపు 20 కేజీలు తగ్గాడు రోహిత్ శర్మ. తనకు ఇష్టమైన ఫుడ్ మొత్తం మానేశాడు. ముఖ్యంగా వడపావ్ అంటే పడి చస్తాడు రోహిత్ శర్మ. దాన్ని కూడా పూర్తిగా మానేశాడు. 38 సంవత్సరాల వయసులో 20 కేజీలు తగ్గిన రోహిత్ శర్మ.. ఇప్పుడు గంటకు 50 నుంచి 100 పుష్ అప్స్ కొడుతున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

దానికి తగ్గట్టుగానే వికెట్ల మధ్య రన్నింగ్… సిక్సర్లు బౌండరీలు కొడుతూ ఇరగదీస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్ ఆడే సమయానికి పూర్తిస్థాయిలో రోహిత్ శర్మ ఫిట్ గా ఉంటాడని తెలుస్తోంది. ఈ మేరకు రోహిత్ శర్మకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.దీంతో రోహిత్ శర్మ 2.0 అంటూ సోషల్ మీడియాలో అతని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ప్రత్యర్థికి చుక్కలు చూపించడం గ్యారంటీ అంటున్నారు. అంతేకాదు 2027లో వరల్డ్ కప్ తీసుకువచ్చి రిటైర్మెంట్ ఇస్తాడని చెబుతున్నారు. ఒకవేళ గిల్ ఫిట్ గా లేకపోతే కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మకు ఇవ్వచ్చని.. మాజీ క్రికెటర్లు కూడా సూచనలు చేస్తున్నారు.

గాడిలో పడ్డ ముంబై ఇండియన్స్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు గాడిలో పడింది. వరుస ఓటమిల తర్వాత నిన్న గుజరాత్ పైన 99 పరుగులు తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీ చేసిన నేపథ్యంలో… ముంబై గెలవ గలిగింది. 99 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ పదవ స్థానం నుంచి ఏడవ స్థానానికి చేరుకుంది. మరో రెండు వరుసగా విజయాలు నమోదు చేస్తే, ముంబైని తట్టుకోవడం ఎవరి వల్ల కాదని అంటున్నారు.

 

https://twitter.com/IS_Netwrk29/status/2046430287681478851?s=20

 

 

https://twitter.com/IS_Netwrk29/status/2046430287681478851?s=20

 

 

Related News

స్టీవ్ వా ప‌రువు తీసిన బంగ్లా క్రికెట‌ర్ అష్రాఫుల్…అత‌ని ఆత్మ‌క‌థ‌లో అన్ని ప‌చ్చి అబద్దాలే

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు…ఈ ద‌రిద్రుల‌ను అల్లా కూడా కాపాడ‌లేడు

సీనియ‌ర్ల‌తో బీసీసీఐ ర‌హ‌స్య మీటింగ్? ఏ క్ష‌ణ‌మైనా గంభీర్ ను గెంటేయ‌డం గ్యారెంటీ!

ఐపీఎల్ 2027కు ముందే పెను ప్ర‌కంప‌న‌లు..బీసీసీఐని చావుకొట్టిన ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు..!

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

Big Stories

Advertisement
×