Chris Gayle: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో ఇప్పటికే 40% మ్యాచ్ లు పూర్తయ్యాయి. 2025 ఐపీఎల్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ ( PUNJAB KINGS) అద్భుతంగా రాణించగా.. ఈసారి కూడా శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో అదరగొడుతోంది. ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం బాగోతం బయట పెట్టాడు డేంజర్ ఆటగాడు క్రిస్ గేల్ ( Chris Gayle). తన కెరీర్ నాశనం చేసింది పంజాబ్ కింగ్స్ అంటూ బాంబు పేల్చాడు. నరకం చూపించారని మండిపడ్డారు. పంజాబ్ కింగ్స్ జట్టు తోనే తన ఐపీఎల్ ప్రయాణం ఊహించని విధంగా ముగిసిపోయిందని ఎమోషనల్ అయ్యారు. దీంతో క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Javed Miandad: ఫర్హాన్ దెబ్బకు బుమ్రా కెరీర్ నాశనం..పాకిస్తాన్ తో పెట్టుకుంటే తొక్కిపడేస్తాం Javed Miandad
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ జట్టుపై మాజీ ఆటగాడు క్రిస్ గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చూడడానికి పంజాబ్ కింగ్స్ అద్భుతంగానే కనిపిస్తుందని.. కానీ ఆ జట్టు ఓనర్లు దుర్మార్గులు అంటూ ఫైర్ అయ్యాడు. ప్లేయర్లను మనుషులుగా చూడకుండా పశువుల లాగా ట్రీట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కారణంగానే తన ఐపీఎల్ నాశనమైందని మండిపడ్డారు.
తనను ఒక సీనియర్ ప్లేయర్ గా కాకుండా, చిన్నపిల్లడిగా ట్రీట్ చేశారని షాకింగ్ ఆరోపణలు చేశారు. తనను బచ్చా ప్లేయర్ లాగా ట్రీట్ చేయడం అదే తొలిసారి అంటూ నిప్పులు చెరిగారు. ఎన్నో రికార్డులు సాధించిన తనను చీప్ గా ట్రీట్ చేసిన నేపథ్యంలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. డ్రెస్సింగ్ రూమ్ లో డిప్రెషన్ లోకి వెళ్లి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. దీంతో క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యలు ప్రీతి జింటా గురించి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి 2021 వరకు క్రిస్ గేల్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ టోర్నమెంటులో ఒకే ఒక్క జట్టుతో ఉండకుండా.. మొత్తం మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు క్రిస్ గేల్. 2009 నుంచి 2010 వరకు కేకేఆర్ జట్టులో ఉన్న క్రిస్ గేల్, 2011 నుంచి 2017 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కొనసాగాడు. ఇక 2018 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్ లో కొనసాగిన క్రిస్ గేల్… వ్యక్తిగత కారణాలవల్ల టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే తన ఐపిఎల్ కెరీర్ లో 175 పరుగుల హైయెస్ట్ స్కోర్ సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు.
Throwback when chris gayle exposed punjab kings management
"Chris Gayle said that being in Punjab pushed him into depression because the management treated players badly and showed zero respect even to a legend like him"
He's not the first player to expose them 👀 pic.twitter.com/r7SgANMUDS
— Stubbsy (@spideypant_) April 21, 2026
🚨 CHRIS GAYLE EXPOSED PUNJAB KINGS 🚨
Chris Gayle said 🗣️,
"My IPL ended prematurely with Punjab. I was disrespected at Kings XI and felt I wasn't treated properly as a senior player. They treated me like a kid. For the first time in my life, I felt like getting into… pic.twitter.com/RbMJe12PSl
— Cricket Central (@CricketCentrl) April 21, 2026