E-Paper
Advertisement

Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!

Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!
Advertisement

Smriti Mandhana Wedding:  టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందానకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నిన్న పెళ్లి పీటలు ఎక్కాల్సిన స్మృతి మందాన, తండ్రి అనారోగ్యం నేప‌థ్యంలో ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. నిన్న పెళ్లి ( Smriti Mandhana Wedding ) జరగాల్సిన సమయంలో స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ ను ప్ర‌త్యేక‌ ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ బాధలో ఉన్న స్మృతి మందానకు  ( Smriti Mandhana) మరో ఊహించని షాక్ ఎదురైంది. స్మృతి మందాన కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆసుపత్రి పాలయ్యాడట.

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

స్మృతి మందాన కాబోయే భర్త ప‌లాష్ ముచ్చ‌ల్ కు కూడా అస్వస్థత

Advertisement

టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందానను పెళ్లి చేసుకోబోతున్న పలాష్ ముచ్చల్ ఆస్పత్రి పాలు అయినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పలాష్ ముచ్చల్ కు ( Palash Muchhal ) నిన్నటి నుంచి వైరల్ ఫీవర్ అలాగే ఎసిడిటీ సమస్య తలెత్తిందట. దీంతో మహారాష్ట్రలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో పలాష్ ముచ్చల్ అడ్మిట్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అయితే నిన్న తండ్రి ఆసుపత్రి పాలు కావడం, ఇప్పుడు కాబోయే భర్త ( Palash Muchhal Hospitalised ) ఆసుపత్రిలో చేరడంతో స్మృతి మందాన ఒత్తిడిలోకి లోనైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

స్మృతి మందాన పెళ్లికి ఇన్ని అడ్డంకులా.. జాతకంలో దోషాలు ఉన్నాయా?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన పెళ్లి గురించి దాదాపు నెల రోజుల నుంచి వార్తలు వైరల్ అయ్యాయి. దాదాపు ఆరు సంవత్సరాల నుంచి స్మృతి మందాన, పలాష్‌ ముచ్చల్ ( Smriti Mandhana-Palash Muchhal Wedding )ప్రేమించుకుంటున్నారు. వీళ్ళు బహిరంగంగానే చెట్టా పట్టాలేసుకొని తిరిగారు. ఇక ఇటీవలే ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి పెళ్లికి ఒప్పించారు. కుటుంబ పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నవంబర్ 23వ తేదీన ముహూర్తం ఫిక్స్ అయింది. హ‌ల్దీ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్ గా చేశారు. టీమిండియా మహిళా క్రికెటర్లు వచ్చి సందడి చేశారు. కానీ అదృష్టం కాస్త దురదృష్టం గా మారింది.

Advertisement

అంతలోనే తండ్రికి గుండెపోటు రావడం, పెళ్లి పీటలపైనే స్మృతి మందాన పెళ్లి ఆగిపోవడం చకచగా జరిగిపోయాయి. నిన్న స్మృతి మందాన మెడలో తాళిబొట్టు పడే సమయంలోనే ఆమె తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు వచ్చింది. ఇక ఈ బాధలో పెళ్లి రద్దు చేసుకున్న స్మృతి మందానకు ఇవాళ మరో టెన్షన్ మొదలైంది. ఆమెకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కు వైరల్ ఫీవర్ తో పాటు ఎస్డిటి సమస్య వచ్చిందట. అతడు కూడా ఆసుపత్రి పాలు కావడంతో స్మృతి మందాన జాతకంలో దోషాలు ఉన్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆమె జాతకం సరిగ్గా లేకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని పండితులు కూడా చెబుతున్నారు ఈ జాతకంలో దోషాలు తొలగించేందుకు ప్రత్యేక పూజలు చేయించాలని అంటున్నారు.

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×