BigTV English

RJ Mahvash – Chahal: నువ్వు రా అసలు మగాడివి.. చాహల్ ప్రియురాలు బోల్డ్ కామెంట్స్

RJ Mahvash – Chahal: నువ్వు రా అసలు మగాడివి.. చాహల్ ప్రియురాలు బోల్డ్ కామెంట్స్

RJ Mahvash – Chahal: టీమిండియా స్టార్ క్రికెటర్ చాహల్.. అతడి రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో చాహల్ తో కలిసి మాహ్వాష్ కనిపించింది. దీంతో ఈ మ్యాచ్ అనంతరం వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని పుకార్లు మొదలయ్యాయి. అప్పటి నుండి ఈ రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి.


 

అయితే తాజాగా మంగళవారం రోజు కలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఓటమి ఖాయం అనుకున్న సమయంలో మ్యాచ్ లో 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని, 16 పరుగులు తేడాతో గెలిచి సంచలన రికార్డ్ అందుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా పంజాబ్ నిలిచింది. అయితే ఈ సంచలన విజయానికి ప్రధాన కారణం పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.


తన స్పిన్ మాయాజాలంతో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టి.. పంజాబ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన చాహల్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో రేడియో జాకి ఆర్జే మహ్వాష్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా చాహల్ తో దిగిన సెల్ఫీ ని షేర్ చేసిన మహ్వాష్.. ” నీ టాలెంట్ మామూలుగా లేదు. అద్భుతమైన, అసాధారణమైన టాలెంటెడ్ మ్యాన్. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచావు. అసంభవ్” అని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకోచ్చింది.

దీంతో మహ్వాష్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ వార్తలపై ఇటీవల చాహల్ – మాహ్వాష్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కానీ వీరిద్దరూ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు చూస్తుంటే మాత్రం.. కచ్చితంగా వీరి మధ్య ఏదో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చాహల్ తన భార్య ధనశ్రీ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుండి మహ్వాష్ – చాహల్ జంటగా కనిపిస్తున్నారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ప్రచారం సాగుతుంది.

 

ఓ సందర్భంలో చాహల్ తనకి మహ్వాష్ ఓ మంచి స్నేహితురాలని తెలిపాడు. ఇక ఆమె కూడా చాహల్ ఆడుతున్న మ్యాచ్లను స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షిస్తుంది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక చాహల్ ని పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ కి ముందు పెద్దగా రాణించలేకపోయాడు చాహల్. ఐదు మ్యాచ్ లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ కలకత్తాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం కీలక పాత్ర పోషించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ విజయంతో ఆ జట్టు యాజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×