Actress: సినీ ఇండస్ట్రీలో ఒక వైపు సినిమాలు సక్సెస్ టాక్ ను అందుకుంటూ దూసుకుపోతుంటే.. మరోవైపు అమ్మాయిల పై ఆగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు ఒక్కొక్కరికి బయటకొచ్చి తమకు ఇండస్ట్రీలో జరిగిన చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. ముఖ్యంగా మలయాళ తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా బయటకు వస్తూ సంచల విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ మలయాళ నటికి ఎదురైన చేదు అనుభవాన్ని గురించి ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమెకు ఎదురైన పరిస్థితి ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మలయాళ ఇండస్ట్రీలో నటి పై హీరో అసభ్య ప్రవర్తన..
మలయాళ ఇండస్ట్రీలో గతంలో చాలామంది అమ్మాయిలు తమని అసభ్యంగా తాకారని ఇంటర్వ్యూల ద్వారా బయటపెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చారు. తాజాకా మరో నటి తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. ఆమె ఎవరో కాదు మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్.. సోషల్ మీడియాలో ద్వారా ఆమె వీడియో ను రిలీజ్ చేశారు.. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఓ సినిమా నిర్మాణ సమయం లో సెట్స్‌లో ఒక అగ్ర హీరో డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఇటీవల మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచార కార్యక్రమానికి హాజరైన నటి అలోషియస్ ఈ వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అలవాటు ఉన్న నటులు నటించే సినిమాలో తాను నటించనని ఆమె పేర్కొన్నారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఆ హీరో గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Also Read : ‘బిగ్ బాస్ 9’ లోకి ప్రభాస్ బ్రదర్.. ఇది అస్సలు ఊహించి ఉండరు..
విన్సీ సోనీ అలోషియస్ సినిమాలు..
విన్సీ అలోషియస్ 1995 డిసెంబరు 12 న కేరళ లోని మలప్పురంలోని పొన్నానిలో జన్మించారు. ఆమె తండ్రి అలోషియస్ డ్రైవర్. ఆమె తల్లి సోనీ టీచర్. ఆమె సోదరుడు విపిన్ విదేశాల్లో పనిచేస్తున్నాడు. బిషప్ కాటన్ కాన్వెంట్ గర్ల్స్ హైస్కూల్లో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. ఏషియన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత మజవిల్ మనోరమ లో ప్రసారమైన 2018 టాలెంట్ హంట్ షో నాయికా నాయకన్ లో విన్సీ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది. 2019 లో మజవిల్ మనోరమలో డి 5 జూనియర్ అనే డాన్స్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అదే ఏడాది లో విక్రుతి అనే మూవీ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ప్రస్తుతం వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే మరో ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ను పలకరించబోతుందని తెలుస్తుంది..
చేదు అనుభవం గుర్తుచేసుకున్న మలయాళ నటి
మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ సంచలన ఆరోపణలు చేశారు. సినిమా నిర్మాణ సమయంలో సెట్స్‌లో ఒక అగ్ర హీరో డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఇటీవల మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచార కార్యక్రమానికి హాజరైన నటి అలోషియస్ ఈ వ్యాఖ్యలు… pic.twitter.com/FC2bkRA0QQ
— ChotaNews App (@ChotaNewsApp) April 16, 2025